Samuthirakani: నటుడు సముద్ర ఖని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాల్లో కీలక పాత్రలు, విలన్ రూల్స్ చేస్తూ తెలుగు, సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. నటుడిగానే కాదు మెగాఫోన్ పట్టి దర్శకుడిగానూ సత్తా చాటుతున్నారు. సినిమాలకు కథలు, మాటలు కూడా అందిస్తుంటారు. ఇలా మల్టీ టాలెంట్ తో సినీ ఇండస్ట్రీలో కీలకంగా మారాడు సముద్రఖని. అయితే తాజాగా ఆయన దళపతి విజయ్ తీరుపై సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఆయన పర్సనల్ రిలేషన్ ని ఉద్దేశిస్తూ విజయ్ పై మండిపడ్డారు.
విజయ్ భార్య షాక్
ప్రస్తుతం విజయ్ ఇటూ రాజకీయాలతో పాటు అటూ తన వ్యక్తిగత జీవితంపై కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. నటనకు ఫుల్ స్టాప్ పెట్టి పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆయన భారీ ప్లాన్ చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో రాబోయే ఆసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే దిశగా సన్నాహాలు చేపట్టారు. ప్రస్తుతం రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆయనకు సడెన్ గా భార్య సంగీత గట్టి షాకిచ్చింది. విజయ్ ఓ నటితో అక్రమ సంబంధం ఉందని, ఆయన నుంచి విడాకులు కావాలని కోరుతూ కోర్టు పిటిషన్ వేసింది.
త్రిష పెళ్లికి..
మరోవైపు నటి త్రిషతో ఆయన రిలేషన్ రూమర్స్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో విజయ్.. త్రిషతో కలిసి చెన్నైలో ఓ వెడ్డింగ్ రిసెప్షన్ రావడం సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. వారిద్దరి కలిసి ఒకే కారులోంచి తెగడం.. సేమ ట్విన్నింగ్ కలర్ డ్రెస్ ధరించడం అందరిలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వీరిద్దరి రూమర్స్ నిజమేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరి రిలేషన్ పై సముద్రఖని ఘాటుగా స్పందించారు.
సముద్రఖని ఫైర్
ఇవాళ చెన్నైలో జరిగిన ఓ సినిమా పూజా కార్యక్రమంలో పాల్గొన్న సముద్రఖని, దర్శకులు బాల, ఆర్ వి ఉదయ్ కుమార్ లతో మాట్లాడుతూ.. విజయ్ ప్రవర్తన పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇదేమైనా ఆటలా.. ఇన్ని జరుగుతున్నా కూడా ఆమెను ఎందుకు బయటకు తీసుకొస్తారు? నాలుగు గోడల మధ్య ఉంచుకోవచ్చు కదా? ఎవరి మీద పగ తీర్చుకుంటున్నారు?’ అంటూ సముద్రఖని కోపంగా మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏది ఏమైనా విజయ్ కావాలనే ఇలా త్రిషను మాటిమాటికి బహిరంగ ప్రదేశాలకు తీసుకురావడం వెనక విజయ్ అంతర్యం ఏంటనేది అర్థం కావడం లేదంటూ సముద్రఖని ఆగ్రహం వ్యక్తం చేశారు.

