Sonu Sood: నటుడు సోనూ సూద్ మరోసారి రియల్ హీరోగా నిరూపించుకున్నాడు. అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. కొవిడ్ టైమ్‌లో కష్టాల్లో ఉన్న లక్షలాది మంది సామాన్యులకు అండగా నిలిచి దేవుడిగా మారాడు సోనూసూద్. ఈ బాలీవుడ్ యాక్టర్ సేవాగుణానికి సినిమా వర్గాలతో పాటు నాయకులు సైతం ఫిదా అయ్యారు. తన పేరు మీదనే ఓ ఫౌండేషన్‌ను నెలకొల్పిన సోనూ సూద్ కోవిడ్ టైమ్ నుంచి నేటి వరకు తన సేవా కార్య వస్తున్నారు.
వృద్ధ రైతు వీడియో వైరల్…
తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు సోనూసూద్. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన అంబదాస్ పవార్ అనే ఓ వృద్ధ రైతు ఎద్దులు లేకుండా తానే స్వయంగా పొలం దున్నుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఎద్దుల స్థానంలో నాగలిని భుజాన మోసుకుంటూ పొలం దున్నుతూ అంబదాస్ పవార్ కనిపించాడు. అతడికి భార్య సాయంగా నిలిచింది. ఈ వీడియోను పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ రైతు దంపతుల వీడియో సోనూ సూద్ కంటపడింది.
సాయం చేస్తా…
ఆ రైతుకు సాయం చేస్తానంటూ సోషల్ మీడియా వేదికగా సోనూసూద్ ప్రకటించాడు. ఆ రైతుకు అవసరమైన జత ఎద్దులను తాను కొనిస్తానని వెల్లడించాడు. అతడి ట్వీట్ వైరల్ అవుతోంది. దానగుణంలో సోనూ సూద్‌ను మించిన వారు లేరని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉందని, రియల్ హీరో అంటూ సోనూ సూద్‌పై పొగడ్తలు కురిపిస్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం ఆ వృద్ధ రైతుకు ట్రాక్టర్ కొనిస్తే బాగుంటుందని కామెంట్స్ చేశారు. వృద్ధుడికి ట్రాక్టర్ నడపటం కష్టమవుతుందని కాబట్టి ఎద్దులు కొనివ్వడమే మంచిది అంటూ సోనూ సూద్ వారికి రిప్లై ఇచ్చారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/yash-ramayana-and-ntr-war-2-the-unexpected-connection/
హీరోగా…
బాలీవుడ్ నటుడు అయిన సోనూ సూద్ తెలుగులో అతడు, కందిరీగ, ఆచార్యతో పాటు పలు సినిమాల్లో విలన్‌గా కనిపించాడు. ఇటీవలే హీరోగా మారిన సోనూ సూద్ ఫతే పేరుతో స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించాడు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ సరైన విజయాన్ని సాధించలేదు.