Monday, June 23, 2025
Homeచిత్ర ప్రభDrugs Case: డ్రగ్స్ కేసులో తమిళ హీరో శ్రీరామ్ అరెస్ట్

Drugs Case: డ్రగ్స్ కేసులో తమిళ హీరో శ్రీరామ్ అరెస్ట్

Actor Sriram arrested in Drug Case: సినీ సెలబ్రెటీలు డ్రగ్స్ వినియోగిస్తున్నారనే వార్తలు ఇటీవల ఎక్కువయ్యాయి. ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిందనే ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు టావినో థామస్ డ్రగ్స్ కేసులో అరెస్టై బెయిల్ పై బయటకు వచ్చారు. ఆయనతో పాటు మలయాళ పరిశ్రకు చెందిన అనేక మంది ప్రముఖులు సినిమా సెట్స్ లో డ్రగ్స్ వినియోగించడం సాధారణం అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నారు. దీంతో పోలీసులు డ్రగ్స్ వినియోగించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు.

ఇదిలా ఉండగానే కోలీవుడ్ సీనియర్ నటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. చెన్నైలో డ్రగ్స్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో నార్కోటిక్స్ ఇంటలిజెన్స్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీరామ్ రక్త నమూనాల సేకరించారు. రిపోర్టుల కోసం ల్యాబ్‌కు పంపారు. అనంతరం నుంగంబాక్కం స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

అంతకుముండు ఈ డ్రగ్స్ కేసులో అన్నాడీఎంకే పార్టీకి చెందిన ప్రసాద్ తో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసారు. విచారణలో భాగంగా వారు ఇచ్చిన సమాచారంతో శ్రీరామ్ పేరు బయటకు వచ్చింది. తమ నుంచి డ్రగ్స్ కొన్నారని చెప్పడంతో పోలీసులు రైడ్ చేయగా డ్రగ్స్ తో రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. దీంతో ఈ కేసులో ఇంకెంత మంది ప్రముఖులు ఉన్నారో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. శ్రీరామ్ అరెస్టుతో కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో కలకలం రేగింది.

తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా వచ్చిన ‘స్నేహితులు’ సినిమాలో శ్రీరామ్ కీలకపాత్ర పోషించారు. అలాగే తెలుగులోనూ ‘ఒకరికి ఒకరు’ మూవీతో మంచి గర్తింపు తెచ్చుకున్నాడు. శ్రీరామ్ అసలు పేరు శ్రీకాంత్. ఏపీలోని తిరుపతి జిల్లాలో జన్మించాడు. సినిమాలపై ఆసక్తితో చెన్నై వెళ్లాడు. చిన్నచిన్న పాత్రలు పోషిస్తూ ‘రోజాపూలు’ సినిమాతో హీరోగా ఎంట్రీ‌‌‌‌ ఇచ్చాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News