Venkatesh – Chiranjeevi: ఓ వైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే కథ, క్యారెక్టర్ నచ్చితే ఇతర స్టార్స్‌తో కలిసి నటించడానికి సై అంటున్నారు విక్టరీ వెంకటేష్. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీలో వెంకటేష్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి, వెంకటేష్ కాంబోను సిల్వర్‌స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
నాట్స్ 2025 వేడుకల్లో…
తాజాగా అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఇచ్చాడు వెంకీమామ. బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. నాట్స్ 2025 వేడుకల్లో బాలకృష్ణతో కలిసి వెంకటేష్ చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్నాడు. ఈ వేడుకల్లో తన అప్‌కమింగ్ మూవీస్ వివరాలను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తున్నట్లు వెంకటేష్ చెప్పాడు.
దృశ్యం ఫ్రాంచైజీలో…
ఈ వేడుకలో త్రివిక్రమ్‌తో (Trivikram Srinivas) ఓ సినిమా చేయబోతున్నట్లు వెంకటేష్ చెప్పాడు. అలాగే దృశ్యం ఫ్రాంచైజ్‌లో భాగంగా తాను, హీరోయిన్ మీనా కలిసి మరో మూవీలో యాక్ట్ చేస్తున్నట్లు వెంకీ మామ (Venky Mama) పేర్కొన్నాడు. చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీలో నటిస్తున్న విషయాన్ని ఫస్ట్ టైమ్ వెంకటేష్ అఫీషియల్‌గా ప్రకటించాడు. ఈ సినిమాలో తాను గెస్ట్ రోల్‌లో కనిపిస్తానని చెప్పాడు. తన క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుందని, చిరంజీవితో తన కాంబినేషనల్‌లో వచ్చే సీన్స్ ఆడియెన్స్‌ను అలరిస్తాయని చెప్పాడు.
సంక్రాంతికి వస్తున్నాం కాంబో…
సంక్రాంతికి వస్తున్నాం తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడితో మరో సినిమా చేయబోతున్నట్లు నాట్స్ 2025 ఈవెంట్‌లో వెంకటేష్ చెప్పాడు. సంక్రాంతికి వస్తున్నాం మూవీకి సీక్వెల్‌గా ఈ మూవీ ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బాలకృష్ణతో..
నాట్స్ ఈవెంట్‌లో టాలీవుడ్ అగ్ర హీరో బాలకృష్ణతో (Nandamuri Balakrishna) ఓ సినిమా చేయబోతున్నట్లు వెంకటేష్ వెల్లడించాడు. అయితే అది ఏ సినిమా అన్నది మాత్రం రివీల్ చేయలేదు. అఖండ 2లో వెంకటేష్ గెస్ట్ రోల్‌లో కనిపించే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.అదే నిజమైతే అభిమానులకు గూస్‌బంప్స్ ఫీలింగ్ కలగడం ఖాయమే అవుతుంది. త్వరలోనే బాలకృష్ణ, వెంకటేష్ మూవీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
300 కోట్లు…
ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ 300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.