సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ (Jailer) మూవీలో విలన్‌గా తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు వినాయకన్ (Vinayakan) మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. పీకలదాక తాగి తన ఇంటి బాల్కనీలో బీభత్సం సృష్టించాడు. ఒంటి మీద కేవలం లుంగీతోనే నిలబడి మద్యం మత్తులో తూలుతూ.. సరిగా నిలబడలేక ఇరుగు పొరుగు వారిని బూతులు తిట్టాడు. లుంగీ జారిపోతున్నా కూడా కనీసం తన కంట్రోల్ లేకుండా అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
కాగా ఈ నటుడు గతంలో కూడా అనేక సార్లు మద్యం మత్తులో పబ్లిక్ ప్రాంతాల్లో హల్ చల్ చేశాడు. ఓసారి ఏకంగా పోలీసులతో గొడవ పెట్టుకుని అరెస్టు అయి జైలుకు కూడా వెళ్లాడు. అలాగే గోవాలో ఓ రెస్టారెంట్‌లో డబ్బులు ఇవ్వకుండా నానా హంగామా చేశాడు. దీంతో అతడి మానసిక స్థితి సరిగా లేదని.. సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.