NTR – Prashanth Neel: సౌత్‌లో చాలామంది యంగ్ హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే సూట్‌కేసు సర్దుకొని ఇంటికెళిపోతున్నారు. మరీ ముఖ్యంగా తెలుగులో అలా వచ్చి ఇలా కనుమరుగవుతున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ఇక్కడ అందం తో పాటు టాలెంట్ ఎంత అవసరమో..సక్సెస్‌లు అంతకన్నా ముఖ్యం. హీరోయిన్స్ విషయంలో మన వాళ్లకి సెంటిఎమెంట్స్ చాలా ఎక్కువ. హిట్స్ ఉన్న హీరోయిన్ని కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి ఆకాశానికి ఎత్తేది మేకర్సే. ఫ్లాపులొస్తే కనీసం కన్నెత్తి చూడకుండా కింద పడేసేది మేకర్సే.
అందుకే, చాలామంది హీరోయిన్స్ సక్సెస్‌లలో ఉన్నప్పుడే సంపాదించుకుంటున్నారు. ఫస్ట్ మూవీ హిట్ అయితే రెండవ సినిమాకి బిజినెస్ క్లాస్ ఫ్లైట్ అడిగేస్తున్నారు. అయితే.. శ్రీదివ్య, ఆనంది, ఈషారెబ్బ, రీతూ వర్మ లాంటి టాలెంటెడ్ బ్యూటీస్ మాత్రం హైట్, పర్సనాలిటీ, గ్లామర్ విషయంలో చిన్న చిన్న లోపాల వల్ల అగ్ర కథానాయికలుగా ఎదగలేకపోతున్నారు. నార్త్ హీరోయిన్స్ లాగా అందాల ఆరబోత విషయంలో వెనకడుగు వేసి అవకాశాలను కోల్పోతున్నారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/dhanush-nagarjuna-kubera-review/
ఆనంది, శ్రీదివ్య లాంటి కుర్రభామలకి హైట్ మైనస్ అవుతోంది. వీరికి పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ రావాలంటే చాలా కష్టం అవుతోంది. ఏళ్ళ తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. అరకొరక అవకాశాలు వచ్చినా అవి చెప్పుకునేందుకు పనిచేయడం లేదు. గతంలో ఎన్‌టిర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవ కుశ సినిమాలో శ్రీదివ్య ఓ చిన్న పాత్ర చేసింది. సడన్‌గా ఈ సినిమాలో తాను నటించానని చెప్తే ఠక్కున గుర్తు రావడం చాలా కష్టం.
అలా అవకాశాల కోసం ఎదుచూస్తున్న ఆనందికి ఇటీవల భైరవం సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలో తన పాత్రకి మంచి గుర్తింపే దక్కింది. తాజా సమాచారం మేరకు ఈ క్యూట్ గర్ల్ కి ప్రశాంత్ నీల్-ఎన్‌టిర్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాలో ఆనందికి ఓ పాత్ర చేసే అవకాశం వచ్చిందట. ఇది ఎంతవరకు నిజమో తెలీదు గానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. చిన్న హీరోయిన్స్ పాన్ ఇండియా ఛాన్స్ అంటూ మాట్లాడుకుంటున్నారు. నిజంగా ఆనందికి ఈ మూవీలో ఛాన్స్ వస్తే గొప్ప అవకాశం అనుకోవచ్చు.