Homeచిత్ర ప్రభColors Swathi: రెండో పెళ్లి చేసుకున్న 'కలర్స్‌' స్వాతి.. ఆ మూవీ డైరెక్టర్‌తో ఏడడుగులు

Colors Swathi: రెండో పెళ్లి చేసుకున్న ‘కలర్స్‌’ స్వాతి.. ఆ మూవీ డైరెక్టర్‌తో ఏడడుగులు

Colors Swathi: ‘కలర్స్‌’ స్వాతిగా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది స్వాతి రెడ్డి. కలర్స్‌ షోతో యాంకర్‌ కెరీర్‌ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత నటిగా, హీరోయిన్‌గా మంచి ఫ్యాన్‌ బేస్‌ సంపాదించుకుంది. అయితే నటిగా మంచి ఆఫర్స్‌ వస్తున్న సమయంలో తన బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుని వెండితెరకు దూరమైంది. అయితే ఇటీవల తన భర్తకు విడాకులు ఇచ్చిన ఆమె ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చింది.

- Advertisement -

‘మంథ్‌ ఆఫ్‌ మధు’ అనే చిత్రంలో రీఎంట్రీ ఇచ్చిన ఆమె తాజాగా ఆ మూవీ డైరెక్టర్‌నే రెండో పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. పెళ్లి ఫోటోలని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ నిన్న అంటే జూలై 8న మూడు మూళ్ల బంధంలోకి అడుగుపెట్టినట్టు ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్‌, సినీ ఇండస్ట్రీ నుంచి స్వాతికి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సాయి ధరమ్‌ తేజ్‌, నవీన్‌ చంద్ర, మంచు లక్ష్మితో పాటు పలువురు సినీ నటీనటులు స్వాతికి శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: Toxic Song: టాక్సిక్ రొమాంటిక్ సాంగ్.. యశ్-కియార కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా

శ్రీకాంత్‌ నగోటి డైరెక్ట్‌ చేసిన రొమాంటిక్‌ డ్రామా ‘మంథ్ ఆఫ్ మధు’ లో స్వాతిరెడ్డి, నవీన్‌చంద్ర హీరోహీరోయిన్లుగా నటించారని తెలిసిందే. ఈ ప్రాజెక్టు తర్వాత కొత్త స్వాతిరెడ్డి మరో చిత్రాల్లో నటించలేదు. కొద్ది రోజులుగా వ్యక్తిగత జీవితంపై ఫోకస్‌ పెట్టిన ఆమె ఇప్పుడు శ్రీకాంత్‌ నగోటిని రెండో పెళ్లి చేసుకుంది. స్వాతి రెడ్డి మొదట తన బాయ్‌ఫ్రెండ్‌, మలయాళి పైలట్‌ వికాస్‌ వాసును 2018 ఆగస్టు 30న వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత అన్యోన్నంగా ఉన్న వీరిద్దరు వ్యక్తిగత కారణాల వల్ల 2022లో విడాకులు తీసుకుని విడిపోయారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News