Homeచిత్ర ప్రభDee Freeman: క్యాన్సర్‌తో ప్రముఖ నటి మృతి

Dee Freeman: క్యాన్సర్‌తో ప్రముఖ నటి మృతి

Dee Freeman Died: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాలీవుడ్‌ నటి డీ ఫిమ్రాన్‌ (66) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ మరణించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. డీ ఫిమ్రాన్‌ స్టేజ్‌ 4 ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారిన పడినట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -

క్యాన్సర్ తో పోరాటం
కొంతకాలంగా ఈ మహమ్మారితో పోరాడుతున్న ఫిమ్రాన్‌ ఏప్రిల్‌ 2న పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె మరణవార్త తెలిసి హాలీవుడ్‌ సినీ నటీనటులు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. అదే విధంగా ఆమె కుటుంబానికి సోషల్‌ మీడియా వేదికగా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కాగా డీ ఫ్రీమాన్ తన కెరీర్‌లో ఎన్నో షోలలో నటించి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ‘ది యంగ్ అండ్ ది రెస్ట్‌లెస్’, ‘సిస్టాస్’ వంటి పాపులర్‌ షోలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

అమెరికా సైన్యంలోనూ..
వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ‘సీన్ఫెల్డ్’ (Seinfeld), ‘డెక్స్టర్’ (Dexter) వంటి వెబ్ సిరీస్‌లలో కూడా ఫిమ్రాన్‌ కీలక పాత్రలు పోషించి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే టెలివిజన్ రంగంలోనూ ఆమె అలరించారు. హాలీవుడ్‌ సినీ, టీవీ పరిశ్రమకు ఆమె అందించిన విశేష కృషికి ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా అందుకున్నారు. కేవలం నటనరంగంలోనే కాకుండ విభిన్న రంగాల్లోనూ ఎంతో ప్రతిభ కనబరిచారు. ఇకపోతే డీ ఫ్రీమాన్ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు అమెరికా మెరైన్ కార్ప్స్ లో దాదాపు ఆరు సంవత్సరాల పాటు పనిచేశారు. అలా సైన్యంలో పనిచేసే తనకంటూ ఒక ప్రత్యేకమైన హోదాని కూడా అందుకున్నారామె.

Also Read: Ranbir Kapoor: రామాయణలో రణ్‌బీర్‌ డ్యుయల్‌ రోల్‌.. రాముడి పాత్రతో పాటు మరో పవర్ఫుల్‌ రోల్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News