Saturday, July 12, 2025
Homeచిత్ర ప్రభIleana D'Cruz: రెండోసారి పండంటి బాబుకి జన్మనిచ్చిన హీరోయిన్ ఇలియానా.. పేరు తెలుసా?

Ileana D’Cruz: రెండోసారి పండంటి బాబుకి జన్మనిచ్చిన హీరోయిన్ ఇలియానా.. పేరు తెలుసా?

Ileana Family: ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన‌ ఇలియానా డీ క్రూజ్ త‌న కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్తను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంది. ఇటీవ‌ల ఆమె రెండోసారి తల్లి అయిన‌ట్లు తెలియ‌జేస్తూ బేబీ బంప్ ఫొటోల‌ను షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే రెండోసారి కూడా పండంటి బాబుకి జన్మనిచ్చినట్లు ఇలియానా తెలియ‌జేసింది. అలాగే ఆమె తన కుమారుడి ఫోటోలను కూడా షేర్ చేసింది.

- Advertisement -

ఇలియానా మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే, ఈ పెళ్లి విషయాన్ని ఆమె బయటపెట్టలేదు. 2023లో ఆమెకు మొదటి కుమారుడు జన్మించాడు. తన మొదటి కొడుకుకు ఫీనిక్స్ డోలన్ అని పేరు పెట్టింది. ఇటీవలే కొన్ని రోజుల క్రితం ఇలియానా తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. తాను రెండోసారి గర్భవతినని అప్పుడామె వెల్లడించింది. ఇప్పుడు, ఆమెకు మరో పండంటి బాబు జన్మించాడు. ఆమె రెండో కొడుకు జూన్ 19న జన్మించాడు అని తెలిపింది. ఇలియానా తన రెండో కుమారుడికి కేను రాఫ్ డోలన్ (Kenu Raaf Dolan) అని పేరు పెట్టింది.

ఇలియానా తన మొదటి సినిమా ‘పోకిరి’తోనే సినీ రంగంలో మంచి గుర్తింపు పొందింది. తక్కువ సమయంలోనే ఆమె స్టార్‌డమ్ సంపాదించుకుంది. తన అందం, అభినయంతో దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ ఆమె ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రవితేజ, విజయ్ దళపతి వంటి పెద్ద హీరోలతో కలిసి ఎన్నో హిట్ చిత్రాలు చేసింది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఆమె బాలీవుడ్‌కు వెళ్లింది. అక్కడ కూడా కొంతకాలం బాగానే రాణించినా, ఆ తర్వాత అవకాశాలు తగ్గాయి. దీంతో ఆమె సినీ పరిశ్రమకు దూరంగా జరిగింది. బాలీవుడ్ ఇలియానాను పెద్దగా పట్టింకోకపోవటంతో మరోసారి ఆమె రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవటంతో ఇలియానాను టాలీవుడ్ సైతం దూరం పెట్టేసింది. దీనికి తోడు కుర్ర హీరోయిన్స్ వరుస అవకాశాలను అందుకుని దూసుకెళ్లిపోయారు.

ప్రస్తుతం ఇలియానా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానులు, అలాగే సినీ తారలు ఇలియానాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఇలియానా సినిమాలకు దూరంగా ఉంటూ తన కుటుంబ జీవితాన్ని ఆనందిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News