Actress kalpika New Conroversy: సినీ నటి కల్పిక గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, యశోద, హిట్ సహా పలు చిత్రాలతో సహాయ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఈ మధ్య కాలంలో వివాదాలకు మారుపేరుగా మారిన సంగతి తెలిసిందే. తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న ఈమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. అయితే తాజాగా ఆమె మరోసారి హంగామా చేసి వార్తల్లో నిలిచింది. నగర శివారులోని మొయినాబాద్ మండలం కనకమామిడి రెవెన్యూ పరిధిలో గల బ్రౌన్‌టైన్ రిసార్ట్‌లో నానా రభస చేసినట్లు తెలిసింది.
Also Read: https://teluguprabha.net/cinema-news/actress-payal-rajput-father-passes-away/
అసలేం జరిగిందంటే
సోమవారం మధ్యాహ్నం రిసార్ట్ కు వచ్చిన కల్పిక.. ఓ గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుని భోజనం చేసింది. అయితే సాయంత్రం పొద్దుపోయాక పరిస్థితి అంతా ఒక్కసారి మారిపోయింది. రిసెప్షన్‌లో ఉండే సిబ్బందిని సిగరెట్లు కావాలని అడిగింది. కానీ సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన రాలేదట. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కల్పిక రిసెప్షన్‌కు వెళ్లి కోప్పడుతూ గొడవ చేసింది. మేనేజరు కృష్ణపై చిందులు కూడా వేసినట్లు సమాచారం అందింది.
అసభ్యంగా వ్యవహరించారంటూ..
గదిలో వైఫై లేదు.. ఇతర సౌకర్యాలు ఏమీ లేవు. కనీసం సిగరెట్లు అయినా తెచ్చివ్వమంటే అది కూడా తేలేదు.. అంటూ తేలేదంటూ ఓ గంటపాటు హంగామా చేసింది. చివరిగా ఇక్కడ ఉండలేనంటూ గది తాళాలను విసిరేసి నగరానికి వెళ్లిపోయింది. అనంతరం తన పట్ల రిసార్టు సిబ్బంది అసభ్యంగా వ్యవహరించారంటూ ఆరోపణలు చేస్తూ.. ఆమె ఓ వీడియోను కూడా విడుదల చేసింది. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.


