Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభKasturi: అరెస్టుకు ముందు కస్తూరి వీడియో.. వైరల్

Kasturi: అరెస్టుకు ముందు కస్తూరి వీడియో.. వైరల్

Kasturi| సినీ నటి కస్తూరి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమెపై కేసు నమోదు అయిన నేపథ్యంలో పరారీ అయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అరెస్టుకు ముందుకు ఆమె ఓ వీడియో రికార్డు చేసింది. పోలీసులకు భయపడి తాను పారిపోయినట్లు వస్తున్నవార్తలను అందులో ఖండించారు. తాను షూటింగ్ కోసమే హైదరాబాద్ వచ్చానని.. షూటింగ్ ముగిసిన వెంటనే పోలీసులకు సహకరించానని పేర్కొన్నారు. పోలీసులకు పూర్తిగా సహకరించానని..తనకు ఎలాంటి భయం లేదని స్పష్టం చేశారు. తన పోరాటం కొనసాగిస్తానని తెలిపారు.

- Advertisement -

కాగా తెలుగు ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కస్తూరిని పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి చెన్నై తరలించారు. అనంతరం ఎగ్మోర్ కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం ఈనెల 29 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను చెన్నైలోని సెంట్రల్ జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad