Kayadu Lohar: తమిళనాడులో మద్యం కుంభకోణం ఎంతటి సంచలాన్నిరేపిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ కుంభకోణంలో కయాదు లోహర్ పేరు వచ్చింది. దీంతో సదరు హీరోయిన్ మాత్రం చాలా ఇబ్బందిని ఎదుర్కొందట. సహజంగానే ఇలాంటి వివాదాస్పద కేసుల్లో సెలెబ్రిటీల పేర్లు వస్తే మీడియా ఎంతలా ఆడేసుకుంటుందో అందరికీ తెలిసిందే. నిజానిజాల్ని పక్కన పెట్టేసి ఫోకస్ అంతా కూడా సెలెబ్రిటీల మీదే పెడుతుంటారు. అలా కయాదు లోహర్ మీద కోలీవుడ్‌లో రకరకాల వార్తలు వచ్చేసి, ఆమె ఇమేజ్‌కు డ్యామేజ్ కల్గించాయట.
అసలే కయాదు ఇప్పుడిప్పుడే తన కెరీర్‌ను గాడిన పెట్టేసుకుంటోంది. తెలుగులో చేసిన సినిమాతో అంత ఫేమస్ కాకపోయినా.. ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ చిత్రంతో క్రేజ్‌ను దక్కించుకుంది. డ్రాగన్ మూవీతో అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో కయాదుకి మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో వరుసగా ఆఫర్లు రావడం మొదలు పెట్టాయి. ఇప్పుడు ఆమె చేతిలో తమిళం నుంచి చాలా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.
Also Read – Duvvada Srinivas – Madhuri: తెరపైకి దువ్వాడ జంట.. ‘ప్రేమంటే’ ప్రత్యేకతలివే
తెలుగులో కయాదు ఓ మూవీని కూడా చేస్తోంది. విశ్వక్ సేన్, అనుదీప్ కాంబోలో వస్తున్న ఫంకీ మూవీలో కయాదు హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫంకీ నుంచి ఓ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. అనుదీప్ స్టైల్లో సింగిల్ లైన్ పంచ్‌లు బాగానే కనిపించాయి. మరి ఫంకీ సినిమా విశ్వక్ సేన్‌కి, కయాదుకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. సినిమా సంగతి అలా పక్కన పెడితే కయాదుకి మాత్రం ఈ మద్యం కుంభకోణం మాత్రం చాలా ఇబ్బందిని తెచ్చి పెట్టిందట.
ఎవరికైనా సరే తప్పులు చేయకుండా, తన తప్పు లేకుండా ఆరోపణల్ని ఎదుర్కొంటూటే ఎంతగానో బాధేస్తుంది. అలానే కయాదు కూడా ఎంతో బాధపడ్డారట. మద్యం కుంభకోణంలో తనకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదని, తనకు అసలు ఆ ఇష్యూతో సంబంధం లేదని తాజాగా క్లారిటీ ఇచ్చింది. కానీ తన పేరు అలా రావడం, తన మీద తప్పుడు వార్తలు రావడంతో ఎంతో ఇబ్బంది పడిందట. తాను ఎంతో బాధపడ్డానని కయాదు చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మద్యం కుంభకోణంలో ఉన్న వ్యక్తులు ఏర్పాటు చేసిన పార్టీకి, తనని పిలవడంతో తాను వెళ్లడం వల్ల తన పేరు ఇలా తప్పుగా బయటకు వచ్చిందని చెబుతోంది.
అలా తన పేరు మీద తప్పుడు వార్తలు వచ్చాయని, అవి రూమర్లే అయినప్పటికీ తాను మాత్రం ఎంతో వేదనకు గురయ్యానని, డిప్రెషన్‌లోకి వెళ్లానని కయాదు చెబుతోంది. కయాదు ప్రస్తుతం వీటన్నటి నుంచి బయట పడి తన పని తాను చేసుకుంటూ బిజీగా ఉంటోందని తెలుస్తోంది.
Also Read – Sreeleela: డెబ్యూ మూవీ కోసం తమిళంలో సొంతంగా డబ్బింగ్ చెప్పిన శ్రీలీల

