Khushbu About Vijay-Trisha: విజయ్-త్రిషల రిలేషన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మీడియా, సోషల్ మీడియాలో మొత్తం వీరి గురించే చర్చ. విజయ్ భార్య సంగీత విడాకులు కావాలని పిటిషన్ వేసినప్పటి నుంచి ఆయన వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందనేది ఇటూ సినీ, అటూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంమైంది. తన భర్త ఓ నటితో వివాహేతర సంబంధంలో ఉన్నాడంటూ విజయ్ భార్య సంగీత బహిరంగ కామెంట్స్ చేసింది. అప్పటి నుంచి ఆ నటి మరెవరో కాదు త్రిష అనే అభిప్రాయపడుతున్నారు.
విజయ్-త్రిషలపై సంగీత కామెంట్స్
గతంలో వీరిద్దరి రిలేషన్ పై వచ్చిన రూమర్స్ కి విజయ్ భార్య కామెంట్స్ మరింత బలం చేకూరింది. ఇక వీరిద్దరు జంటగా ఓ వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరయ్యారు. అది మరింత సంచలనంగా మారింది. విజయ్ త్రిషలు కలిసి ఒకే కారులో నుంచి దిగడం తమిళనాట తీవ్ర చర్చ మొదలైంది. అప్పటి నుంచి విజయ్-త్రిష గురించే చర్చించుకుంటున్నారు. వారి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సినీ, రాజకీయ వర్గాల్లో సైతం వారి గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో వారికి మద్దతుగా కొందరు సినీ ప్రముఖులు నిలుస్తున్నారు. తాజాగా సీనియర్ నటి ఖుష్బూ సైతం ఈ వ్యవహారంలో స్పందించింది. చెన్నైలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయ్-త్రిష విషయంపై ఆమె అభిప్రాయాన్ని కోరారు.
అది వారి వ్యక్తిగతం..
దీనికి ఆమె స్పందిస్తూ.. ఇది వారి వ్యక్తిగత విషయమన్నారు. అది వాళ్ల పర్సనల్ విషయం అని, అది ప్రజలను ప్రభావితం చేయనంతవరకు ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ‘ఈ అంశంతో(విజయ్-త్రిషల రిలేషన్) ప్రజలకు ఏం సంబంధం ఉందో నాకు అర్థం కావడం లేదు. ఇది వారి వ్యక్తిగత జీవితం. అది ఎవరినైనా ప్రభావితం చేస్తే.. అప్పుడు దాని గురించి మాట్లాడటంలో తప్పులేదు. అది పూర్తిగా వారి వ్యక్తిగత జీవితం. దీనికి ప్రజలకు ఏం సంబంధం లేదు. వారికే ఎలాంటి సమస్య లేనప్పుడు ప్రజలేందుకు దాన్ని పట్టించుకోవాలి. దీనిని ఎందుకు పెద్ద విషయంగా చూస్తున్నారు? వారు తమకు నచ్చినట్లుగా జీవితాన్ని కొనసాగిస్తారు.
Also Read: Ustad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతో తెలుసా?
దాని వల్ల ప్రజలు ఏ విధంగానూ ప్రభావితం కారు’ అని ఖుష్బూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. త్రిష అంశం విజయ్ రాజకీయ జీవితంపై ప్రభావితం చూపే అవకాశం ఉందా అనే ప్రశ్నకు ఖుష్బు ఇలా అన్నారు. ‘ప్రజలు తెలివైన వాళ్లు. ఎవరికి, ఎందుకు ఓటు వేయాలో వాళ్లకు బాగా తెలుసు. పర్సనల్ లైఫ్ దానిని ప్రభావితం చేస్తుందని నేను అనుకోను. ఆయన నాయకుడైనా కాకపోయినా.. మనలాగే ఒక మనిషి. ప్రజల వ్యక్తిగత జీవితంతో అతనికి కూడా ఎలాంటి సంబంధం ఉండదు’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

