Manya Anand: ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, మీటూ అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. హీరోయిన్లు, నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాల్ని చెబుతూ వేధింపుల్ని బయట పెడుతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో మహిళలు ఎలాంటి భయాలు, బెరుకు లేకుండా పని చేసే వాతావరణాన్ని కల్పించాలనే డిమాండ్ కూడా వినిపిస్తూ ఉంటుంది. అందుకే ప్రతీ ఇండస్ట్రీలో ఉమెన్ సెల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇక తాజాగా ఓ బుల్లితెర నటి తనకు ఎదురైన చేదు ఘటనను బయటపెట్టేసింది.
భారత సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి వచ్చే వార్తల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే చాలా మంది నటీమణులు, సింగర్లు ఈ మీటూకి వ్యతిరేకంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. చిన్మయి వంటి వారు అయితే స్టార్ హీరోలు, స్టార్ రైటర్ల మీద, సింగర్ల మీద వచ్చే మీటూ ఆరోపణలు, క్యాస్టింగ్ కౌచ్ ఘటనల మీద గొంతెత్తుతూ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో నటి ఇలానే తనకు ఎదురైన చేదు ఘటన గురించి నోరు విప్పింది.
బుల్లితెర నటి మాన్య ఆనంద్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనుష్ మేనేజర్ మీద సంచలన ఆరోపణలు చేసింది. తనను కమిట్మెంట్ అడిగాడు అంటూ ధనుష్ మేనేజర్ మీద చేసిన కామెంట్లు ఇప్పుడు కోలీవుడ్‌లో మంటలు రేపుతోంది. ధనుష్ మేనేజర్ మీద సోషల్ మీడియాలో వ్యతిరేక జ్వాలలు రగులుతున్నాయి. వెంటనే అతడ్ని మేనేజర్‌గా తీసేయాలి అంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Also Read – Akhanda 2 Thaandavam: మొదటిసారి పాన్-ఇండియా ప్రచారంలో బాలయ్య
ధనుష్ మేనేజర్‌తో పాటుగా మరో మేనేజర్ కూడా అలానే కమిట్మెంట్ అడిగాడని ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చింది. మరి ఈ కామెంట్ల మీద ధనుష్ రియాక్ట్ అవుతాడా? తన మేనేజర్ మీద వచ్చిన ఆరోపణల్ని రియాక్ట్ అవుతాడా? అన్నది చూడాలి. ధనుష్ ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. దర్శకుడిగా, నిర్మాతగా, హీరోగా ఇలా అన్ని రకాలుగా చిత్రాలు చేస్తూ అందరినీ అలరిస్తున్నాడు.
ధనుష్ ఇక చివరగా నిత్య మీనన్‌తో కలిసి ఇడ్లీ కడై (ఇడ్లీ కొట్టు) అంటూ ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. తమిళంలో ఇడ్లీ కడై మూవీ అంతో ఇంతో విజయాన్ని సాధించింది. కానీ తెలుగులో మాత్రం ఇడ్లీ కొట్టు దారుణంగా బోల్తా కొట్టేసింది. ఓటీటీలోకి ఇడ్లీ కొట్టు వచ్చిన తరువాత కొంత మంది మాత్రం సినిమాను పొగిడేశారు. ఇక ఇడ్లీ కొట్టు తరువాత ధనుష్ ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తాడా? అని ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
Also Read – Anupama Parameswaran: 2025లో ఏడో సినిమా – లాక్‌డౌన్ రిలీజ్ డేట్ ఫిక్స్ – అనుపమ పరమేశ్వరన్ రికార్డ్

