Monday, July 14, 2025
Homeచిత్ర ప్రభVenu Swamy: వేణు స్వామితో పవన్ కల్యాణ్ హీరోయిన్.. రహస్య మీటింగ్ అందుకేనా?

Venu Swamy: వేణు స్వామితో పవన్ కల్యాణ్ హీరోయిన్.. రహస్య మీటింగ్ అందుకేనా?

Venu Swamy: వేణు స్వామి పేరు ఇప్పుడు టాలీవుడ్‌లో చెబితే తెలియని వాళ్లు లేరు అనుకుంట. ఎందుకంటే ఆయన రాజకీయ నాయకులతో పాటు సినీ సెలబ్రిటీల జాతకాల గురించి ఇంటర్వ్యూలు ఇస్తూ పాపులర్ అయ్యారు. అలానే కొంతమంది హీరోయిన్లకు ప్రత్యేక పూజలు చేయిస్తూ వస్తున్నాడు. అయితే ఇటీవలే కొన్ని వివాదాల వల్ల కోర్టు చుట్టూ తిరిగిన వేణు స్వామి.. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు ఓ హీరోయిన్‌కి ప్రత్యేక పూజలు నిర్వహించాడు.

- Advertisement -

సోషల్ మీడియాలో అనేక అంశాలపై తన అభిప్రాయాలను చెబుతూ హాట్ టాపిక్‌గా మారాడు వేణు స్వామి. అయితే ఇటీవలే జరిగిన భారత్- పాకిస్థాన్ యుద్ధం, అహ్మదాబాద్ విమాన ప్రమాదాలను తాను ముందే ఊహించినట్లు చెప్పుకొస్తున్న వేణు స్వామి వద్దకు హీరోయిన్లు మరోసారి క్యూ కడుతున్నారు. గతంలో ఆయనతో ప్రముఖ హీరోయిన్లు రష్మిక, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి, ఆషు రెడ్డి, నిశ్విక నాయుడు, ఇనాయా సుల్తానా వంటి తదితరులు వేణు స్వామితో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నాడు. అయితే తాజాగా పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ హీరోయిన్ నిధి అగర్వాల్ మరోసారి వేణు స్వామితో ప్రత్యేక పూజ చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వేణు స్వామితో హీరోయిన్ నిధి అగర్వాల్ పూజ చేయించుకోవడం ఇదేమీ మొదటి సారి కాదు. సుమారు రెండేళ్ల క్రితం కూడా ఆయనతో ప్రత్యేక పూజలు చేయించిందీ అందాల తార. ఆ పూజ తర్వాత ఆమెకి సినిమా ఆఫర్లు బాగానే వచ్చాయి. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అలాగే ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు ఇప్పటికే పూర్తి కావస్తుండడంతో.. ఈ సమయంలో ఆమె ప్రత్యేక పూజలు చేయించడం పట్ల ఫాన్స్‌లో ఆసక్తి నెలకొంది.

నిధి అగర్వాల్ నటించిన ‘హరి హర వీరమల్లు’ ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తన సినిమా సూపర్ హిట్ కావాలని హీరోయిన్ నిధి.. వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించినట్లు సమచారం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

వేణు స్వామితో హీరోయిన్ నిధి అగర్వాల్ పూజలు..ఇదిగో వీడియో..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News