Homeచిత్ర ప్రభActress Poorna: మరోసారి తల్లయిన నటి పూర్ణ.. అపురూపమైన కానుక అంటూ ఎమోషనల్‌

Actress Poorna: మరోసారి తల్లయిన నటి పూర్ణ.. అపురూపమైన కానుక అంటూ ఎమోషనల్‌

Actress Poorna: నటి షామ్న ఖాసిం అలియాస్‌ పూర్ణ మరోసారి తల్లయ్యింది. ఈ రోజు ఉదయం తెల్లవారు జామున ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా నటి పూర్ణ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. గతేడాది ఆగస్టులో గర్భం దాల్చిన ఆమె మార్చి 14న ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు వెల్లడించింది.

- Advertisement -

దేవుడిచ్చిన అపురూప కానుక
ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. “దేవుడి ఆశీస్సులతో ఈరోజు ఉదయం 4 గంటల 25 నిమిషాలకు పాప పుట్టింది. తను మాకు లభించిన అపురూపమైన కానుక. ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా డెలివరీ అయినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆస్పత్రి బృందానికి కూడా ధన్యవాదాలు” అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు పూర్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా పూర్ణ 2022లో వ్యాపారవేత్త షానిద్‌ అసిఫ్‌ అలీని పెళ్లి చేసుకుంది. ఈ దంపతుల ప్రేమకు గుర్తుగా 2023లో బాబు పుట్టాడు. నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

పూర్ణ సినిమాలు
మాలయాళ నటి అయిన ఆమె సీమటపాకాయ్‌ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత అవును, తెలుగు హారర్‌ చిత్రం అవును సినిమాతో ఆమె హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత అవును శ్రీ మహాలక్ష్మి, నువ్వలా నేనిలా, రాజుగారి గది వంటి చిత్రాలతో గుర్తింపు పొందింది. సహా నటిగా అఖండ 2తో పాటు పలు చిత్రాల్లో నటించింది. మరోవైపు తెలుగు డ్యాన్స్‌ షో ఢీకి కూడా జడ్జీగా వ్యవహరించి బుల్లితెరపై అలరించింది. అదే సమయంలో దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపార షానిద్ ఆసిఫ్ అలీని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన కొన్నేళ్లకు ఆమె కొడుకు పుట్టాడు. ఈ రోజు కూతురు జన్మించిన ఈ సందర్భంగా తన కొడుకు హమ్దాన్‌కు తోడుగా ఇప్పుడు చిట్టి చెల్లి వచ్చిందంటూ పూర్ణ మురిసిపోయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News