Jana Nayagan – Thalapathy Vijay: నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ ప్రియమణి ఇప్పుడున్న సీనియర్ హీరోయిన్స్ అందరితో పోల్చుకుంటే చాలా బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్ ఇంకోవైపు హోస్ట్‌గా కెరీర్ చాలా సాఫీగా సాగిపోతుంది. భామాకలాపం సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్నారు. ది ఫ్యామిలీ మేన్ సిరీస్ కూడా వెబ్ సిరీస్ పరంగా ప్రియమణికి చాలామంచి పేరు తెచ్చింది. ఒకరకంగా సిరీస్ చేస్తున్నారు అంటే దానికి కారణం ది ఫ్యామిలీ మేన్ అని చెప్పక తప్పదు.
తెలుగులో ప్రియమణి నారప్ప (Narappa), విరాట పర్వం (Virata Parvam) సినిమాలలో అద్భుతమైన పాత్రలు చేసి మెప్పించారు. పెళ్లికి ముందు గ్లామర్ రోల్స్ చేసి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కానీ, పెళ్లి తర్వాత మాత్రం పూర్తిగా మారిపోయారు. సినిమాలు చేసినా, సిరీస్ చేసినా హోంలీ రోల్స్ మాత్రమే ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం అవే ప్రియమణికి మంచి క్రేజ్ తెచ్చిపెడుతున్నాయి. అనుష్క శెట్టి లాంటి సీనియర్ హీరోయిన్స్‌తో పోల్చుకుంటే ప్రియమణి ఎక్కువ ప్రాజెక్ట్స్‌నే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్ మూవీలో కీలక పాత్రను చేస్తున్నారు.
హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ జన నాయగన్. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారు. అంతకంటే ముందు తన పొలిటికల్ కెరీర్ కి ఉపయోగపడేలా చేస్తున్న సినిమా కావడంతో జన నాయగన్ సినిమాపై అటు కోలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో అందరికీ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో సక్సెస్ కొట్టి ఆ తర్వాత రాజకీయాల మీద పూర్తిగా దృష్టి పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
అయితే, జన నాగయన్ సినిమాలో నేచురల్ పర్ఫార్మర్ అయిన ప్రియమణి ఓ కీలక పాత్రను చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో భాగమైనందుకు ప్రియమణి తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఆమె..నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలకంటే జన నాయగన్ మూవీలో రోల్ నాకు ఎంతో స్పెషల్ అని చెప్పారు. నా ఫేవరేట్ మూవీస్‌లో ఒకటిగా జన నాయగన్ నిలిస్తుందని తెలిపారు. ఇప్పటికే ప్రియమణి ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేసి దేశవ్యాప్తంగా ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నారు.
ఇప్పుడు చేస్తున్న జన నాయగన్ మూవీతో నెక్స్ట్ లెవల్ పాపులారిటీ వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. ఇక తెలుగులో ప్రియమణికి అల్లు అర్జున్ ఎంతో ఇష్టమైన హీరో అని ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే వెంటనే ఒప్పుకుంటానని గతంలో చెప్పారు. ఈ నేపథ్యంలో అట్లీ, అల్లు అర్జున్ సినిమాలో ప్రియమణికి మంచి రోల్ ఉన్నట్టు కోలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ఏడాది మలయాళంలో వచ్చిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ మంచి సక్సెస్‌ని సాధించింది.