Monday, July 14, 2025
Homeచిత్ర ప్రభSSMB 29: మ‌హేష్‌ మూవీ కంటే ముందు ప్రియాంక చోప్రా చేసిన తెలుగు సినిమాలు

SSMB 29: మ‌హేష్‌ మూవీ కంటే ముందు ప్రియాంక చోప్రా చేసిన తెలుగు సినిమాలు

Rajamouli – Mahesh Babu: మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి మూవీతో లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఇండియ‌న్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా. ఒక ర‌కంగా ఈ సినిమానే ప్రియాంక చోప్రాకు ప్రాప‌ర్ తెలుగు డెబ్యూ మూవీ కావ‌డం గ‌మ‌నార్హం. దాదాపు వెయ్యి కోట్ల బ‌డ్జెట్‌తో యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

- Advertisement -

అనౌన్స్‌మెంట్ నుంచే…

మ‌హేష్‌బాబు (Mahesh Babu), రాజ‌మౌళి క‌ల‌యిక‌లో వ‌స్తోన్న ఫ‌స్ట్ మూవీ ఇదే కావ‌డంతో అనౌన్స్‌మెంట్ నుంచే సినిమాపై అంచ‌నాలు ఆకాశాన్ని అంటాయి. అభిమానుల ఊహ‌ల‌కు పూర్తి భిన్నంగా హాలీవుడ్ సినిమాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్ట్స్ తో ఈ మూవీ ఉండ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి స్టోరీ ఏంటి? మ‌హేష్‌బాబు లుక్‌ (Mahesh Babu Look), క్యారెక్ట‌ర్ ఎలా ఉండ‌బోతుంది? మ‌హేష్‌బాబుకు జోడీగానే ప్రియాంక క‌నిపిస్తుందా? ఇలా ఎన్నో ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ వేటికి ఆన్స‌ర్‌ ఇవ్వ‌కుండా సెలైంట్‌గా త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు రాజ‌మౌళి (Rajamouli). ఈ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ మూవీకి సంబంధించి త్వ‌ర‌లోనే మ‌రో కొత్త షెడ్యూల్ హైద‌రాబాద్‌లో మొద‌లుకాబోతున్న‌ట్లు తెలిసింది. ఈ షెడ్యూల్‌లో మ‌హేష్‌బాబుతో పాటు ప్రియాంక చోప్రా పాల్గొన‌నున్న‌ట్లు స‌మాచారం.

అపురూపం…

అయితే మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి సినిమా ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తెలుగు డెబ్యూ మూవీ కాదు. 2002లోనే ప్రియాంక చోప్రా తెలుగులో ఓ సినిమా చేసింది. హీరోయిన్‌గా కెరీర్ మొద‌లుపెట్టిన తొలినాళ్ల‌లో అపురూపం (Apurupam) అనే తెలుగు సినిమాలో న‌టించింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ మూవీలో ప్రియాంక చోప్రా అచ్చ తెలుగు ప‌ల్లెటూరి అమ్మాయిగా క‌నిపించింది. అపురూపం సినిమాకు శ‌శి ర‌వి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌ధుక‌ర్ హీరోగా క‌నిపించాడు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా ఆర్థిక కార‌ణాల వ‌ల్ల అపురూపం సినిమా ఆగిపోయింది.

ALSO READhttps://teluguprabha.net/cinema-news/pooja-hegde-team-up-with-dhanush-for-her-next-movie/

జంజీర్ రామ్‌చ‌ర‌ణ్‌…

ఆ త‌ర్వాత చాలా ఏళ్ల‌కు తుఫాన్ మూవీలో రామ్‌చ‌ర‌ణ్‌కు (Ram Charan) జోడీగా ప్రియాంక చోప్రా క‌నిపించింది. తెలుగు, హిందీ బైలింగ్వ‌ల్‌గా తెర‌కెక్కిన ఈ మూవీతోనే రామ్‌చ‌ర‌ణ్ బాలీవుడ్‌లోకి (Bollywood) ఎంట్రీ ఇచ్చాడు. హిందీలో జంజీర్ పేరుతో ఈ మూవీ రిలీజైంది. బాలీవుడ్‌తోపాటు తెలుగులోనూ ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. మ‌హేష్‌బాబు మూవీ కంటే ముందు ప్రియాంక చోప్రా చేసిన రెండు సినిమాలు ఆమెకు అంత‌గా క‌లిసి రాలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News