Actress Shobana Ramayana: సినీ ప్రియులందరికీ గుడ్ న్యూస్! లేటెస్ట్ అండ్ హాట్ టాపిక్ ఏమిటంటే, సీనియర్ నటి శోభన మరో క్రేజీ మూవీలో అభిమానులను మెప్పించనుంది. ఇటీవలే ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంలో కీలక పాత్రలో మెప్పించిన శోభన, ఇప్పుడు నితీష్ తివారీ (Nitish Tiwari) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రెండు భాగాల ‘రామాయణ’ సినిమాలో ఒక కీలక పాత్రను పోషించబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఈ వార్త విన్న అభిమానుల ఆనందానికి అవధులు లేవు. కెరీర్ లో ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో నటించి, అభినయ నేత్రిగా పేరుపొందిన శోభన, ఈ సంవత్సరం ఆరంభంలో ‘తొడరుమ్’ (Thodarum) చిత్రంలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. రెండు దశాబ్దాల తర్వాత మోహన్ లాల్‌తో (Mohan Lal) తిరిగి కలిసి నటించడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పుడు ‘రామాయణ’ లాంటి మెగా ప్రాజెక్ట్‌లో భాగం కావడం నటిగా ఆమెకు మరింత గుర్తింపునిస్తుంది.
తాజా సమాచారం మేరకు శోభన ‘రామాయణ’ చిత్రంలో లంకాపతి రావణుడి తల్లి పాత్ర కైకేసిను పోషించనున్నారు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణకలను కన్నది కైకేసి. ఇలాంటి ఓ ఆసక్తికరమైన, పవర్‌ఫుల్ పాత్రకు శోభనలాంటి నటి మరింత వన్నె తెస్తుందనటంలో సందేహం లేదు. అయితే ఈ పాత్రను ఆమె చేస్తున్నట్లు ప్రత్యేకంగా చెప్పలేదు. కానీ.. ‘రామాయణ’ సినిమాలో నటిస్తున్నట్లు తెలియజేశారు. శోభన తన సోషల్ మీడియాలో రామాయణం గ్లింప్స్ వీడియోను షేర్ చేస్తూ, ‘తరాలను తీర్చిదిద్దిన కథలో భాగం కావడం గౌరవంగా ఉంది. నమిత్ మల్హోత్రా రామాయణం, రాముడు వర్సెస్ రావణుడి అమర కథ ప్రపంచానికి స్వాగతం. ఈ అవకాశం వచ్చిందని మీతో చెప్పడం ఆనందంగా ఉంది.. ధన్యవాదాలు’ అని రాసారు. అంతేకాదు, ‘మన నిజం… మన చరిత్ర’ అని రాస్తూ అని అందులో పేర్కొన్నారు.
భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న‘రామాయణ’లో (Ramayana Movie) రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, మరియు రావణుడి పాత్రలో పాన్ ఇండియా స్టార్ యష్ నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్ సినీ ప్రియులందరినీ ఆకట్టుకుంది. నితీష్ తివారి దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి రానుండగా, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానుంది. తొలి పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, రెండో భాగానికి సంబంధించిన షూటింగ్‌ను ఆగస్ట్ నుంచి ప్రారంభించనున్నారు.