Trisha Assets: ఈ మధ్య త్రిష తరచూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్‌తో ఆమె రిలేషన్ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం వీరిద్దరు సహాజీవనంలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకునేందుకు సిద్ధమయ్యారంటూ ఫిలిం దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు విజయ్ భార్య సంగీత చేసిన కామెంట్స్ ఈ రూమర్స్‌కి మరింత ఆజ్యం పోశాయి.
విజయ్ తో రిలేషన్..
తన భర్తకు నటితో అక్రమ సంబంధం ఉందని, ఆమె వల్ల తమ వైవాహిక జీవితంలో విభేధాలు వచ్చాయంటూ బహిరంగ కామెంట్స్ చేసింది. అదే టైంలో విజయ్-త్రిష కలిసి ఓ నిర్మాత కొడుకు వెడ్డింగ్ రిసెప్షన్‌కి హాజరవ్వడం తీవ్ర దుమారం రేపింది. క్రిటిక్స్ వీరి తీరుని తప్పుబడుతుంటే.. అభిమానులు మాత్రం సపోర్టుగా నిలిచారు. ఈ క్రమంలో త్రిషపై విపరీతమైన ట్రోల్స్ మొదలయ్యాయి. ఈక్రమంలో ఖుష్బు వంటి సినీయర్ నటీనటులు ఆమె సపోర్టుగా నిలిచారు. ఇలా వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తున్న త్రిష.. ఇప్పుడు తన ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో నిలిచాయి. తమిళనాడు ఎన్నికల వేళ త్రిష ఆస్తుల చిట్టా నెట్టింట్ వైరల్‌గా మారింది.
చెన్నై అసెంబ్లీ ఎన్నికలు
ఈ నెలలోనే (ఏప్రిల్ 23) చెన్నై అసెంబ్లి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్స్ కోసం విజయ్ రెండేళ్ల క్రితమే సిద్ధమయ్యారు. ఎన్నికలకు కోసం నామినేషన్ వేసేందుకు ఇటీవల తన ఆస్తుల వివరాలను ఎన్నికల ఆఫిడవిటీలో చేర్చిన సంగతి తెలిసిందే. ఇలా విజయ్ ఆస్తులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో ఇప్పుడు త్రిష ఆస్తులకు సంబంధించిన వివరాలు కూడా తమిళనాడులో హాట్ టాపిక్ గా మారాయి. గత కొంతకాలంగా విజయ్ సంగీతకు కాకుండా త్రిష పేరు మీద ఆస్తులు కొనుగోలు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే త్రిష పేరు మీద ఉన్న ఆస్తి వివరాలు వైరల్ అవుతున్నాయి.
ఆస్తుల చిట్టా ఇదే..
పలు నివేదికల ప్రకారం.. త్రిష తన నికర ఆస్తులు సుమారు రూ. 100 కోట్ల విలువ చేస్తాయని తెలుస్తుంది. వీటితోపాటు చెన్నై హైదరాబాద్ వంటి మహానగరాలలో ఈమెకు ఖరీదైన ఆస్తులు కూడా ఉన్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. త్రిష రియల్ ఎస్టేట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. వీటితో పాటు ఖరీదైన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయట. నటిగా ఆమె ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు నుంచి రూ. 12 కోట్టు పారితోషికంగా తీసుకుంటుందని సమాచారం. ఇలా సినిమాల ద్వారా, బిజినెస్ ద్వారా ఆమె భారీగా సంపాదించారట. మరోవైపు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ తో కూడా త్రిష భారీగా సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె తెలుగులో చిరంజీవికి జోడిగా విశ్వంభర సినిమా చేస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Director Ranjith: లైంగిక ఆరోపణలు కేసు.. డైరెక్టర్‌పై సస్పెన్షన్ వేటు

