Tollywood: టాలీవుడ్‌లో మిడ్, స్మాల్ రేంజ్ హీరోలు ఇప్పుడు వెబ్ సిరీస్‌ల మీద ఫోకస్ పెడుతున్నట్టుగా సమాచారం. సినిమాలు, వెబ్ సిరీస్‌లు అంటూ బ్యాలెన్స్ చేస్తూ నార్త్ హీరోలు ఎక్కువగానే సంపాదించుకుంటూ ఉన్నారు. హిందీలో అటు సిరీస్‌లు, ఇటు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోన్నారు. అయితే తెలుగులో మాత్రం హీరోలు కేవలం సినిమాల మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. వెబ్ సిరీస్ కల్చర్ అనేది తెలుగులో చాలా తక్కువ. అయితే ఇప్పుడిప్పుడే మన హీరోలు ఎక్కువగా వెబ్ సిరీస్‌లు చేసేందుకు ముందుకు వస్తున్నారట.
ఈ క్రమంలోనే వెంకీమామ, రానా నాయుడు అంటూ వెబ్ సిరీస్‌తో అదరగొట్టేశాడు. ఇక ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ కూడా ఓ వెబ్ సిరీస్‌ను చేసేందుకు ఓకే చెప్పాడట. అమెజాన్‌లోనే రానున్న ఈ సిరీస్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోందట. నాగ చైతన్య అయితే ‘దూత 2’ సిరీస్ కూడా స్టార్ట్ చేయనున్నాడు. అడివి శేష్ అయితే నెట్ ఫ్లిక్స్‌తో మాటలు జరుపుతున్నాడట. నెట్ ఫ్లిక్స్‌కి ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడట. ఆనంద్ దేవరకొండ కూడా నెట్ ఫ్లిక్స్‌కి ఓ సిరీస్ చేసి పెట్టాడు.
Also Read – Ravi Teja: విశ్వంభర డైరెక్టర్‌కు హ్యాండిచ్చిన రవితేజ – ఓవర్ బడ్జెట్ కారణమా?
తక్షకుడు అనే వెబ్ సిరీస్‌ను ఆనంద్ దేవరకొండ చేసిన సంగతి తెలిసిందే. తరుణ్ భాస్కర్ కూడా అమెజాన్‌కి ఓ వెబ్ సిరీస్ చేసి పెడుతున్నాడట. ఇక సమంత అయితే వెబ్ సిరీస్‌ల్లో ట్రెండ్ క్రియేట్ చేసిన సంగతి తెలిపిందే. ఫ్యామిలీ మెన్ 2, సిటాడెల్ అంటూ డిజిటల్ ఫ్లాట్ ఫాంలో దుమ్ములేపేసింది. ఈ ఏడాది సమంత మరో సిరీస్‌ని కూడా స్టార్ట్ చేస్తుందని అంటున్నారు. అలా మన తెలుగు హీరోలు ఇప్పుడు ఎక్కువగా వెబ్ సిరీస్‌లు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
చిరంజీవి, నాగార్జున, బాలయ్య వంటి వారు వెబ్ సిరీస్‌లు చేస్తారా? లేదా? అన్నది మాత్రం డౌటే. ఆల్రెడీ ఇది వరకే చిరు మాత్రం మంచి కథ దొరికితే వెబ్ సిరీస్‌లు అయినా చేస్తాను అని చెప్పారు. కానీ ఫ్యామిలీ మెన్ కథ చిరంజీవి వద్దకు వెళ్తే మాత్రం వర్కౌట్ కాలేదు. మొదటగా రాజ్ అండ్ డీకే ఆ కథను చిరంజీవి కోసమే రాసుకున్నారన్న సంగతి తెలిసిందే.
Also Read – Sreeleela: యాక్టర్…ఇక నుండి డాక్టర్ – ఎమ్‌బీబీఎస్ పట్టా అందుకున్న శ్రీలీల

