Dacoit Trailer: యంగ్ హీరో అడివి శేష్, మృణాళ్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం డెకాయిట్. సణీల్ డియో దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్ కార్యక్రమంతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా నేడు (ఏప్రిల్ 4) మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు, టీజర్ మూవీపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక పాటలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. టీజర్‌లో హీరో హీరోయిన్‌పై రివెంజ్ తీసుకునేట్టుగా చూపించారు. ఇది మూవీపై మరింత క్యూరియాసిటీ పెంచింది. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ హీరోహీరోయిన్ల ప్రేమ, పెళ్లి వంటి రొమాంటిక్ సన్నివేశాలతో పాటు వీరిద్దరి మధ్య రివెంజ్ యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. రొమాంటిక్ సీన్స్ మొదలైన ఈ ట్రైలర్ చివరిలో సస్పెన్స్‌తో ఎండ్ అవుతూ మూవీ మంచి బజ్ క్రియేట్ చేస్తుంది.
లవ్, ఎమోషన్, యాక్షన్ ఇలా అన్ని కలగలపి ట్రైలర్ కట్ చేసిన విధానం ఆకట్టుకుంటోంది. ‘హే నువ్వు ఉంటావ్ కదా.. నేను ఉండాను కదా’ అనే డైలాగ్ ట్రైలర్‌కి హైలెట్‌గా నిలిచింది. ఇందులో అడివి శేష్ హరిగా.. మృణాళ్ ఠాకూర్ జూలియట్ పాత్రలో కనిపించబోతున్నారు. ట్రైలర్ చూస్తుంటే ప్రేమికులైన హరి, జూలియట్‌లు పెళ్లి చేసుకుని విడిపోయినట్టు ట్రైలర్ చూపించారు. వీరి మధ్య వచ్చిన అనుకోని సంఘటనలు వారిని శత్రువులుగా మార్చిందని తెలుస్తోంది.
మరి దానివెనక కారణమేంటి? హీరో హీరోయిన్ అంతగా ద్వేషించడానికి కారణం ఏంటనేది? అంశాలు ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచుతున్నాయి. నా లైఫ్ నాకు కావాలి అంటూ హీరో అనడం, జైలు లైఫ్, పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం.. ఓ డీల్ కోసం విడిపోయిన వీరిద్దరి కలవడం వంటి సన్నివేశాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. మొత్తానికి ఈ ట్రైలర్ మూవీపై అంచనాలను మరింత రెట్టింపు చేసిందనే చెప్పాలి. బీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. మరి ఏప్రిల్ 10న విడుదలకు సిద్దమౌతోన్న ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

