Homeచిత్ర ప్రభAdivi Sesh: ఆ సీన్‌లో అనుష్కని కాలితో తన్నా.. నావల్ల ఆమెకు గాయమైంది

Adivi Sesh: ఆ సీన్‌లో అనుష్కని కాలితో తన్నా.. నావల్ల ఆమెకు గాయమైంది

Adivi Sesh: హీరో అడవి శేష్‌ ప్రస్తుతం డెకాయిట్‌ చిత్రంతో బిజీగా ఉన్నాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ యంగ్‌ హీరో రొమాంటిక్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో వస్తుండటంతో ఫ్యాన్స్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 10న డెకాయిట్‌ రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. డెకాయిట్ ప్రమోషన్స్‌లో భాగంగా అడవి శేష్‌ తాజాగా ఇచ్చిన ఇంటర్య్వూలో ఓ ఆసక్తికర విషయం బయటపెట్టాడు. బాహుబలి మూవీ టైంలో తాను, అనుష్క సీన్‌లో ఓ సంఘటన జరిగిందని, దాని వల్ల అనుష్క బాధపడిందంటూ షాకింగ్‌ విషయం చెప్పాడు.

- Advertisement -

కాగా డెకాయిట్‌ రిలీజ్‌ సందర్భంగా యాంకర్‌ సుమ యూట్యూబ్‌ ఛానల్‌ ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా సుమతో మూవీ విశేషాలు పంచుకున్న అడవి శేష్‌ బాహుబలి మూవీ టైంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. బాహుబలి ఫస్ట్‌ పార్ట్‌లో అడవి శేష్‌ ఓ ముఖ్యపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. భళ్లాల దేవుడు కొడుకు భద్రుడిగా కనిపించాడు. ఫస్ట్‌ పార్ట్‌లో అనుష్కను మహిష్మతి రాజ్యంలో సంకేళ్లతో బంధించి ఉండగా.. భుద్రుడి పాత్రలో అడవి శేష్‌ అనుష్క కొట్టే సీన్‌ ఉందనే విషయం తెలిసిందే. ఈ సన్నివేశంలో అనుష్కని కాలితో తన్నగా నిజంగానే ఆమెకు దెబ్బతగిలిందని చెప్పాడు అడవి శేష్‌.

ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. “అనుష్క చాలా మంచి వ్యక్తి. ఆమె పేరులోనే స్వీటీ ఉంది. పేరుకు తగ్గట్టే ఆమె చాలా స్వీట్‌. బాహుబలి టైంలోనే తనతో ఫస్ట్‌ టైం మాట్లాడాను. ఫస్ట్‌ పార్ట్‌లో ఖైదీగా ఉన్న అనుష్కను భద్రుడి పాత్రైనా నేను కొడుతూ నిద్ర లేపాలి. ఆ సీన్‌ అయిపోగానే నేను అనుష్క దగ్గరికి వెళ్లి మీకు ఏం దెబ్బ తగల్లేదు కదా అని అడిగా. ఎందుకంటే.. అప్పటికే నా వల్ల తనకి దెబ్బ తగిలింది. నేను కాలితో తన్నడంతో అనుష్క మెడనొప్పితో బాధపడింది. నిజానికి ముందు నేను సున్నితంగానే కాలితో తన్నాను. కానీ, రాజమౌళి గారు ఆ పవర్‌ రాలేదనడంతో సీన్‌ పండటం కోసం గట్టిగా తన్నాల్సి వచ్చింది. దీంతో అనుష్కకు దెబ్బ తగిలింది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అడవి శేష్‌ కామెంట్స్‌ వైరల్‌ అవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News