Wednesday, July 16, 2025
Homeచిత్ర ప్రభSekhar Kammula: కుబేర ఎఫెక్ట్.. శేఖ‌ర్ క‌మ్ముల‌కి డిమాండ్

Sekhar Kammula: కుబేర ఎఫెక్ట్.. శేఖ‌ర్ క‌మ్ముల‌కి డిమాండ్

Kubera Movie: సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్మ్ ని డిసైడ్ చేసేది కేవలం సక్సెస్ మాత్రమే. ఒక్క హిట్ పడితే అడ్వాన్సులు వస్తుంటాయి. అదే ఫ్లాప్ పడితే ఫోన్ ఎత్తేవాళ్ళే కరువవుతారు. హిట్ మీదే ప్రతీ ఒక్కరి కెరీర్ ఆధారపడి ఉంటుంది. అంతేకాదు, మొదటి సినిమాకి 10 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్న దర్శకుడు కూడా ఆ సినిమా హిట్ అయితే కోటి కావాలని డిమాండ్ చేస్తుంటాడు.

- Advertisement -

ప్రస్తుతం శేఖర్ కమ్ముల కూడా తన నెక్స్ట్ సినిమాకి గట్టిగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు లేటెస్ట్ న్యూస్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర మంచి హిట్ సాధించింది. బ్రేకీవెన్ దిశగా పరుగులు పెడుతోంది. దీనికి కన్నప్ప మూవీపై వచ్చిన డివైడ్ టాక్ కూడా కలిసి వస్తోంది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటించగా..అగ్ర నిర్మాత సునీల్ నారంగ్ నిర్మించారు.

ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ నెల 20న పాన్ ఇండియా వైడ్‌గా రిలీజైన కుబేర సినిమా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ధనుష్, నాగార్జున ల యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని ప్రశంసలు వచ్చాయి. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్నకి కూడా ఇది మంచి పాత్ర అని చెప్పాలి.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/dil-raju-wife-tejaswini-reveals-secret-behind-their-marriage/

ఇప్పటి వరకు అక్కువ బడ్జెట్‌తో క్లాస్ చిత్రాలను అందించిన దర్శకుడు శేఖర్ కమ్ముల ఇప్పుడు కుబేర మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. దీంతో శేఖర్ కమ్ముల డిమాండ్ బాగా పెరిగిందని టాక్ వినిపిస్తోంది. తన నెక్స్ట్ సినిమా కోసం క్రేజీ హీరోలు లైన్‌లో ఉన్నారు. మెగాస్టార్ కూడా ఈ దర్శకుడికి ఆఫర్ ఇచ్చారు. నానితో ఆల్రెడీ ఒక సినిమా చర్చల దశలో ఉంది. స్టార్ హీరోను కూడా శేఖర్ కమ్ముల తన సినిమాకి వచ్చేసరికి ఆయనకి నచ్చినట్టుగానే చాలా సింపుల్ గా మలుచుకుంటారు.

కుబేర మూవీ సక్సెస్‌తో అగ్ర హీరోలందరు కథ ఉంటే చెప్పమని అడుగుతున్నారట. కానీ, శేఖర్ కమ్ముల మెంటాలిటి అది కాదు. స్టార్ హీరో డేట్స్ ఇచ్చారు కదా అని ఏ కథ పడితే ఆ కథను రాసేసి చెప్పే రకం కాదు. కథ పూర్తిగా తయారవ్వాలి. ఆయనకి బాగా నచాలి. అప్పుడే ఆ కథలో సూటయ్యే హీరో కోసం వేట మొదలు పెడతారు. అయితే, ఇప్పుడు శేఖ కమ్ముల కి ఉన్న డిమాండ్‌తో వరుసగా అడ్వాన్సులు తీసుకొని హీరోలను లైన్‌లో పెట్టుకోవచ్చు. కానీ, అలా చేయరు. కాబట్టే శేఖర్ కమ్ముల నుంచి ప్రకటన వచ్చేవరకూ సోషల్ మీడియాలో వచ్చే వార్తలను పట్టించుకోకపోవడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News