Homeచిత్ర ప్రభAnushka Shetty: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న అనుష్క!

Anushka Shetty: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న అనుష్క!

Anushka Shetty Marriage: స్వీటీ అనుష్క.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సౌత్‌ ఇండస్ట్రీలో ఒకప్పుడు లేడీ సూపర్‌ స్టార్‌గా ఓ వెలుగువెలిగింది. హీరో సమానం యాక్షన్ చేసి ఇండస్ట్రీ జేజమ్మగా పేరుగాంచింది. బాహుబలితో దేవసేన ఆడియన్స్‌ మన్నలు పొందిన అనుష్క ఆ తర్వాత భాగమతి, సైజ్ జీరో వంటి చిత్రాలు చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైంది. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత మిస్‌ శెట్టి-మిస్టర్‌ పోలిశెట్టి చిత్రంలో రీఎంట్రీ ఇచ్చింది.

- Advertisement -

రెండు మూడేళ్లకో సినిమా
అప్పటి నుంచి చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తుంది. మూవీ మూవీ రెండు మూడేళ్ల గ్యాప్‌ తీసుకుంటూ ఆడియన్స్‌ని అలరిస్తూ వస్తున్న స్వీటీ ఇప్పటి వరకు సింగిల్‌గానే ఉన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆమె పెళ్లిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు ఎవరోకరితో ముడిపెడుతూ అనుష్క పెళ్లి ఫిక్స్‌ చేస్తున్నారు నెటిజన్స్‌. అయితే కొన్ని రోజులకు అవన్ని రూమర్సే అని తేలిపోతుంది. అయితే చాలా కాలం తర్వాత మరోసారి అనుష్క పెళ్లి వార్తలు వార్తల్లో నిలిచాయి. స్వీటీ పెళ్లికి రెడీ అయ్యిందనేది ఈ వార్తల సారాంశం.

మరోసారి పెళ్లి వార్తలతో
ఈ లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. 44 ఏళ్ల అనుష్క ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  వరుడు బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త అని, ఆమె కుటుంబానికి అత్యంత సన్నిహితుడంటూ కోలీవుడ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కొంతకాలం క్రితం స్వీటీకి అతడితో పరిచయం ఏర్పడిందట. అది కాస్తా ఇష్టంగా మారడంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయం వారి కుటుంబ సభ్యులకు చెప్పగా వారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు, మరి ఈ వార్తలపై స్వీటీ నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి.

Also Read: Jr NTR Look: ఆందోళన కలిగిస్తున్న ఎన్టీఆర్‌ లుక్‌.. నీల్‌ మావ ఏం ప్లాన్‌ చేస్తున్నావ్‌!

ప్రభాస్ తో డేటింగ్?
అయితే, మిర్చి, బాహుబలి చిత్రాల టైంలో అనుష్క-ప్రభాస్‌లు రిలేషన్‌లో ఉన్నారని, వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు తెగ ప్రచారం అయ్యాయి. ఆ తర్వాత కూడా వీరి పెళ్లి వార్తలు బాగా వినిపించాయి. కానీ, ఎప్పటికప్పుడు ఈ రూమర్స్‌ కొట్టిపారేస్తూ తాము మంచి స్నేహితులమేనని వారు స్పష్టం చేస్తూనే ఉన్నారు. కానీ, వీరి పెళ్లి వార్తలకు మాత్రం ఫుల్‌స్టాప్‌ పడలేదు. ప్రస్తుతం ప్రభాస్‌ తన చిత్రాలలో బిజీగా ఉన్నాడు. అనుష్క ఇండస్ట్రీకి దూరంగా ఉంటూనే.. అప్పుడప్పుడు వెండితెరపై మెరుస్తూ అభిమానులను అలరిస్తోంది. చివరిగా అనుష్క ఘాటీ చిత్రంలో పలకరించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఆమె అదే యూవీ క్రియేషన్స్‌ మరో సినిమా చేస్తున్నట్టు టాక్‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News