Peddi Postponed: రూమర్సే నిజమయ్యాయి. అనుకున్నట్టే పెద్ది మూవీ వాయిదా పడింది. ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగాన్ని పెద్దిని జూన్‌కి వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ వెల్లడించారు. కాగా రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మంగా ఈ చిత్రం రూపొందుతుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలో ఓ రేంజ్‌లో ఉన్నాయి.
బజ్ పెంచుతున్న అప్డేట్స్
అలాగే ఇప్పటికే పెద్ది నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్ని కూడా విపరీతమైన రెస్పాన్స్ అందుకున్నాయి. దీంతో మూవీపై రోజురోజుకు అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. దీంతో పెద్దిని ఎప్పుడెప్పుడు బిగ్‌స్క్రీన్‌పై చూస్తామా అని ఫ్యాన్స్, ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ, ఎప్పటికప్పుడు మూవీ టీం మాత్రం అభిమానులను నిరాశే పరుస్తూను ఉంది. మొదట పెద్దిని మార్చి 19న రిలీజ్ చేస్తామని మూవీ టీం ప్రకటించింది. కానీ, అనుకోని కారణాల వల్ల ఈ సినిమాను వాయిదా వేశారు. ఏప్రిల్ ౩౦న మూవీని విడుదల చేస్తామని ప్రకటించారు.
మరోసారి వాయిదా
కానీ, కొన్ని రోజులుగా ఏప్రిల్ 30కి కూడా పెద్ది వచ్చే అవకాశం లేదని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తుంది. అంతేకాదు మూవీ ఈవెంట్స్‌లోనూ పెద్ది విడుదలపై ప్రస్తావన వస్తూనే ఉంది. కానీ, ఎక్కడ కూడా మూవీ టీం నోరు మెదపలేదు. షెడ్యూల్ ప్రకారం వస్తుందంటూ తప్పించుకున్నారు. కానీ, ఎట్టకేలకు ఆ రూమర్స్‌నే నిజం చేస్తూ మూవీ మరోసారి వాయిదా వేసింది మూవీ టీం. ఈ మేరకు తాజాగా పెద్ది వాయిదాపై సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ ఓ నోట్ విడుదల చేసింది. ‘మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. గ్లింప్స్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పెద్ది మూవీ పట్ల మీ ప్రేమకు చాలా సంతోషంగా ఉన్నాం.
మూవీ టీం ఆఫిషియల్ ప్రకటన
ఇప్పటికే సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. కేవలం ఓ సాంగ్ షూట్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడే ఎడిట్ కాపీని చూశాం. అద్భుతంగా వచ్చింది. కానీ మీకు మరింత అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించడం కోసం కృషి చేస్తున్నాం. మరింత ఫర్‌ఫెక్షన్‌తో మీ ముందుకొస్తాం. జూన్‌లో పెద్దిని మీ ముందుకు తీసుకొస్తాం. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. మీ సపోర్ట్, ఓపికకు మరోసారి ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చారు. మూవీని వాయిదా వేయడంతో మెగా ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. దీనికి ఇషాన్ సక్సేనా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (అలియాస్ శివన్న) ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
We want to give our audience nothing but the best.#PEDDI in cinemas this June ❤🔥 pic.twitter.com/io4MFHfXJy
— PEDDI (@PeddiMovieOffl) April 15, 2026

