Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభUnstoppable 2 : ముగ్గురు హీరోయిన్ల‌తో బాల‌య్య సంద‌డి

Unstoppable 2 : ముగ్గురు హీరోయిన్ల‌తో బాల‌య్య సంద‌డి

Unstoppable 2 : నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్ 2’. త‌న‌దైన శైలిలో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు బాల‌య్య‌. ఇక షో కి ఇటీవ‌ల పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌చ్చాడు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఇటీవ‌ల విడుద‌ల చేశారు. దీంతో ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

తాజాగా ఈ షో త‌దుప‌రి ఎపిసోడ్‌లో పాల్గొన‌బోయే గెస్టుల లిస్టును ఆహా విడుద‌ల చేసింది. సీనియ‌ర్ న‌టీమ‌ణులు జ‌య‌సుధ‌, జ‌య‌ప‌ద్ర‌లు రానున్నారు. వీరితో పాటు హీరోయిన్ రాశి ఖ‌న్నా కూడా పాల్గొన‌నుంది. మ‌హిళ‌లు మాత్ర‌మే ఉన్న మొద‌టి ఎపిసోడ్ ఇదే కానుంది. ఈ ముగ్గురితో బాల‌య్య ఏ ఏ విష‌యాలు చ‌ర్చిస్తాడ‌నేది ఆస‌క్తిగా మారింది. త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన ప్రొమోను విడుద‌ల చేయ‌నున్నారు మేక‌ర్స్‌.

ఇదిలా ఉంటే.. ఈ షోకి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా వ‌స్తాడ‌నే టాక్ గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అయితే దీనిపై మేక‌ర్స్ ఇంత వ‌ర‌కు స్పందించ‌లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News