Friday, November 8, 2024
Homeచిత్ర ప్రభJai Hanuman: 'జై హనుమాన్'.. ఆంజనేయస్వామి పాత్రలో హీరో ఎవరంటే..?

Jai Hanuman: ‘జై హనుమాన్’.. ఆంజనేయస్వామి పాత్రలో హీరో ఎవరంటే..?

Jai Hanuman|దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prasanth varma) దర్శకత్వం వహించిన ‘హనుమాన్'(Hanuman) సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్‌బాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘జై హనుమాన్'(Jai Hanuman) చిత్రం రానున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమాలోని హనుమాన్ పాత్రలో ఏ స్టార్ హీరో నటించనున్నారనే ఉత్కంఠకు తెరపడింది. దీపావళి కానుకగా విడుదల చేసిన పోస్టర్‌లో హనుమాన్ పాత్రలో ఎవరు నటించనున్నారో ప్రకటించారు. ‘కాంతార’ మూవీతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కన్నడ స్టార్ హీరో రిషభ్‌ శెట్టి(Rishab Shetty) ఆంజనేయస్వామి పాత్రలో నటించనున్నారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో రాముడి విగ్రహాన్ని పట్టుకుని రిషభ్ శెట్టి కూర్చుని ఉన్నాడు. ఈ పోస్టర్ సినిమాపై ఒక్కసారిగా అంచాలను పెంచేసింది. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది.

- Advertisement -

కాగా ‘శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి?’ అనే ప్రశ్నకు సమాధానంగా ‘జై హనుమాన్‌’ (Jai Hanuman) రూపుదిద్దుకోనుంది. ‘హనుమాన్‌’కి మించి వందరెట్లు భారీ స్థాయిలో ‘జై హనుమాన్‌’ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్‌ ఇప్పటికే ప్రకటించారు. హనుమాన్ చిత్రంలో హీరోగా నటించిన తేజ సజ్జా.. సీక్వెల్‌లో హీరో కాదని, సీక్వెల్‌లోనూ అతడు హనుమంతు పాత్రలో కనిపిస్తాడని తెలిపారు. ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో(PVCU) భాగంగా రూపొందుతున్న ఈ మూవీలో హనుమంతుడి పాత్రను ఎవరు పోషిస్తారు? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పుడు ఆ ఉత్కంఠకు ముగింపు పలికింది.

ఇక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ మూవీతో పాటు, ‘అధీర’, ‘మహాకాళి’ చిత్రాలు కూడా విడుదల కానున్నాయి. ఇటీవల దసరా పండుగ సందర్భంగా ‘మహాకాళి’ చిత్రం మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ నటిస్తుందని సమాచారం. మరోవైపు నందమూరి నట వారసుడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ పరిచయ చిత్రానికీ కూడా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News