Saturday, July 12, 2025
Homeచిత్ర ప్రభAIR Web Series: ఏ కులాన్నీ టార్గెట్ చేయలేదు.. సారీ చెప్పిన డైరెక్టర్ సందీప్ రాజ్

AIR Web Series: ఏ కులాన్నీ టార్గెట్ చేయలేదు.. సారీ చెప్పిన డైరెక్టర్ సందీప్ రాజ్

Sandeep Raj: ఓటీటీ మాధ్యమం ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా ఇటీవలే స్ట్రీమింగ్ అవుతున్న ‘ఆల్ ఇండియా ర్యాంకర్స్’ (ఏఐఆర్) వెబ్ సిరీస్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. జోసెఫ్ క్లింటన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌కు మొదట మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా కొన్ని అభ్యంతరకర సన్నివేశాల కారణంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా, ‘కలర్ ఫోటో’ డైరెక్టర్ సందీప్ రాజ్ ఈ వివాదంపై సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పడంతో ఈ ఇష్యూ మరింత వైరల్ అయ్యింది.

- Advertisement -

‘ఏఐఆర్’ సిరీస్ విషయానికి వస్తే ఇందులో ప్రధానంగా పదో తరగతి పాసైన ముగ్గురు విద్యార్థులు విజయవాడలో ఇంటర్‌లో చేరిన తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను, ప్రైవేటు విద్యాసంస్థలు ర్యాంకుల కోసం విద్యార్థులపై చూపించే ఒత్తిడి ఎలా ఉంటుందనే అంశాల గురించి ప్రస్తావించారు. అయితే, హాస్టల్‌లో ఓ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ‘కులం’ ఫీలింగ్ ఉన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తూ, పరోక్షంగా ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసేలా రూపొందించిన సన్నివేశం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ సీన్ నెట్టింట్లో నిప్పు రాజేసింది.

ఈ కాంట్రవర్సీపై సందీప్ రాజ్ తన సోషల్ మీడియాలో హృదయపూర్వక క్షమాపణలు తెలిపారు. ‘నేను విషయాలను కప్పిపుచ్చడానికో, మేము చేసిన దానికి మద్దతు ఇవ్వడానికో ఈ పోస్ట్ పెట్టడం లేదు. ఒక ఫిలింమేకర్‌గా ఆడియన్స్ ఎల్లప్పుడూ కరెక్టే అని భావిస్తాను. ఈ సిరీస్‌లోని కంటెంట్ మిమ్మల్ని బాధపెడితే, దానిలో భాగమైనందుకు నేను చాలా చింతిస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. తమకు ఎవరిపైనా ద్వేషం లేదని, లేదా ఏదైనా మతాన్ని లేదా నిర్దిష్ట సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయాలనే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. అలాగే సదరు వివాదాస్పద సన్నివేశాన్ని ఇప్పటికే తొలగించామని సందీప్ రాజ్ తెలిపారు.

ALSO READhttps://teluguprabha.net/cinema-news/ram-charan-latest-pan-india-movie-peddi-latest-update/

‘ప్రతి ఒక్కరూ తమ కెరీర్ ప్రారంభంలో తప్పులు చేస్తారు. మేము అదే చేశాం అయితే వెంటనే దాన్ని సరిదిద్దుకున్నాం’ అన్నారు. రానున్న రోజుల్లో ఏదైనా కంటెంట్‌ను సిద్ధం చేసేటప్పుడు మరింత బాధ్యతాయుతంగా ఉంటానని ఆయన తెలియజేశారు. ఈ వివాదంపై ఓటీటీ మాధ్యమం కూడా స్పందించింది. ఇకపై రానున్న కంటెంట్‌తో తమ మాధ్యమం గౌరవం, సమగ్రత విలువలను ప్రతిబింబించేలా చూసుకుంటామని, మరింత జాగ్రత్తగా, శ్రద్ధగా ఉంటామని పోస్ట్ పెట్టింది. అయితే, సందీప్ రాజ్ క్షమాపణలు చెప్పినా, ఈటీవీ విన్ వివరణ ఇచ్చినా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాత్రం ఇంకా కొనసాగుతోందని, తొలగించిన వీడియో క్లిప్పింగ్స్‌పై ప్రశ్నలు లేవనెత్తుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వివాదం సినీ పరిశ్రమలో కంటెంట్ క్రియేషన్లో మరింత బాధ్యతాయుతమైన విధానం అవశ్యకతను మరోసారి గుర్తు చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News