Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభAishwarya Lekshmi : బాబోయ్.. ఈ సంవత్సరంలో ఏకంగా 9 సినిమాలని రిలీజ్ చేసిన హీరోయిన్

Aishwarya Lekshmi : బాబోయ్.. ఈ సంవత్సరంలో ఏకంగా 9 సినిమాలని రిలీజ్ చేసిన హీరోయిన్

- Advertisement -

Aishwarya Lekshmi : ఒకప్పుడు హీరోలు, హీరోయిన్స్ సంవత్సరానికి 10 సినిమాలకి పైగా నటించేవాళ్ళు అని చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పటి హీరోలు సంవత్సరానికి ఒక సినిమా చేస్తే గ్రేట్. హీరోయిన్స్ మహా అయితే మూడు సినిమాలుచేస్తే గ్రేట్. కానీ ఈ హీరోయిన్ 2022 లో ఏకంగా 9 సినిమాలని రిలీజ్ చేసింది.

మలయాళ భామ ఐశ్వర్య లక్ష్మి మలయాళంలో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి మొదట మలయాళంలో వరుసగా సినిమాలు చేసి ఇప్పుడు తెలుగు, తమిళ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తుంది. మూడు భాషల్లోనూ ఐశ్వర్యకు మంచి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఐశ్వర్య లక్ష్మి నుంచి 2022లో ఏకంగా 9 సినిమాలు తెలుగు, తమిళ్, మలయాళం కలిపి రిలీజ్ అయ్యాయి.

2022 సంక్రాంతికి ‘పుతాం పుదు కాలై విధ్యాధ’ అనే తమిళ్ సినిమాతో మొదలుపెట్టి ‘అర్చన 31 నాట్ అవుట్’ మలయాళం, ‘గాడ్సే’ తెలుగు, ‘గార్గి’, కెప్టెన్, పొన్నియిన్ సెల్వన్ 1 తమిళ్, ‘అమ్ము’ తెలుగు, ‘కుమారి’ మలయాళం, ‘గట్టి కుస్తీ’ తమిళ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇందులో కొన్ని హీరోయిన్ గా, మరికొన్ని సపోర్టింగ్ యాక్ట్రెస్ గా చేసింది. ఈ హీరోయిన్ స్పీడ్ చూసి మిగిలిన హీరోయిన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇక 2023కి కూడా అప్పుడే నాలుగు సినిమాలని లైన్లో పెట్టేసింది ఈ మలయాళ కుట్టి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad