Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 మూవీ రిలీజ్ ముంగిట అభిమానులకు పెద్ద షాకిచ్చింది. ఈ సినిమా వాయిదా పడింది. ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అఖండ 2 రిలీజ్ పోస్ట్ పోన్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 5న అఖండ 2 రిలీజ్ కావడం లేదంటూ నిర్మాణ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. అతి త్వరలోనే మంచి న్యూస్‌తో అభిమానుల ముందుకు వస్తామంటూ ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు.
అఖండ 2 వాయిదాతో బాలకృష్ణ అభిమానులు డిజపాయింట్ అవుతున్నారు. నిర్మాణ సంస్థను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పెయిడ్ ప్రీమియర్స్‌తోనే తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 రిలీజ్ కావాల్సివుంది. తొలుత ప్రీమియర్స్‌ను వాయిదా వేశారు. ఆ తర్వాత సినిమానే రిలీజ్ కావడం లేదని ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. చివరి నిమిషంలో ఓ స్టార్ హీరో సినిమా వాయిదా పడటం టాలీవుడ్ చరిత్రలోనే ఇదే మొదటిసారి అని అంటున్నారు.
Also Read- Ashika Ranganath: పొట్టి దుస్తుల్లో ఆషికా అదిరే అందాలు చూశారా?
పాత బకాయిల విషయంలో 14 రీల్స్ ప్లస్‌పై బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ హైకోర్టులో కేసు వేసింది. తమకు ఇవ్వాల్సిన 28 కోట్లు చెల్లించేవరకు అఖండ 2 రిలీజ్‌ను ఆపాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఈరోస్ ఇంటర్నేషనల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాంతో అఖండ 2 రిలీజ్ వాయిదాపడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రోజు ఈ పిటీషన్‌పై తదుపరి విచారణ కొనసాగనున్నట్లు సమాచారం.
ఈ సమస్యలను క్లియర్ చేసే సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. ఫైనాన్షియల్ ఈష్యూస్‌ను క్లియర్ చేయడానికి హీరో బాలకృష్ణతో పాటు డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా ముందుకొచ్చినట్లు సమాచారం. తమ రెమ్యూనరేషన్‌ను పదకొండు కోట్ల వరకు వదులుకోవడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read- Pragya Jaiswal: అఖండ 2 నుంచి ప్రగ్యా జైస్వాల్‌ను అందుకే తీసేశాం – బాలకృష్ణ క్లారిటీ
అఖండ 2 మూవీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఈ రోజు మధ్యాహ్నం లోగా క్లియర్ కావచ్చునని టాక్ వినిపిస్తుంది. మ్యాట్నీ షోస్ లేదంటే నైట్ షోస్ నుంచి ఈ సినిమా స్క్రీనింగ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ సమస్యలు సెటిల్ కాకపోతే సినిమా వాయిదాపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. డిసెంబర్ 19 లేదా 25లలో అఖండ 2 ప్రేక్షకుల ముందుకు రావచ్చునని సమాచారం. అఖండ 2 మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో మూవీ ఇది.
With a heavy heart, we regret to inform you that #Akhanda2 will not be releasing as scheduled due to unavoidable circumstances.
This is a painful moment for us, and we truly understand the disappointment it brings to every fan and movie lover awaiting the film.
We are working…
— 14 Reels Plus (@14ReelsPlus) December 4, 2025

