Akhanda 2 Review: “కెమెరా మెన్స్ ఆర్ రెడీ, బాబు రెడీ బాబు, స్టార్ట్ కెమెరా, యాక్షన్!” ఈ పిలుపు థియేటర్‌లో పడగానే ఎలక్ట్రిసిటీ షాక్ కొట్టింది. బాలయ్య, బోయపాటి కాంబోపై ఫ్యాన్స్ పెట్టుకున్న ప్రతి మాస్ఎలివేషన్ అంచనాను ఫస్ట్ హాఫ్ పది వేల శాతం జస్టిఫై చేసింది. ప్రతి ఫ్రేమ్‌లో ఆ కాంబో ఎనర్జీ కనిపిస్తుంది. మూవీ మొదలవ్వడం ‘అఖండ’ రీక్యాప్ తో అయినా, వెంటనే స్టోరీని గ్లోబల్ స్కేల్‌కి తీసుకెళ్లారు. అదే చైనా బయో వార్!
ALSO READ: Chinmayi: మార్ఫ్‌డ్ ఫోటోలతో వేధింపులు… చిన్మయి ఆగ్రహం, పోలీసులకు ఫిర్యాదు
అఖండ 2 తాండవం కథ:
‘అఖండ’ మొదటి భాగం జరిగిన సుమారు 18 సంవత్సరాల తర్వాత కథ మొదలవుతుంది. బాల మురళి కృష్ణ ( బాలకృష్ణ) కుమార్తె జనని (హర్షాలి మల్హోత్రా) DRDO లో ట్రైనీగా ఉన్న సమయంలో, భారతదేశాన్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని శత్రుదేశమైన చైనా భావిస్తుంటుంది. భారతీయులు పవిత్రంగా భావించే కుంభమేళాలో వైరస్ ఎటాక్ జరుగుతుంది. జనని దీనికి వ్యాక్సిన్‌ను కనుగొంటుంది, చైనా ఆర్మీ జననిని వెంబడిస్తుండగా… జననికి ఇచ్చిన మాట కోసం శివారాధనలో ఉన్న అఖండ శిఖందర్ రుద్ర (అఘోరా) తిరిగి వస్తాడు. ఈ వైరస్ వెనుక అసలు కుట్ర ఏమిటి? ఇందులో (ఆది పినిశెట్టి) పాత్ర ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఫస్ట్ హాఫ్:
సినిమా స్టార్టింగ్ నుంచే హై ఎనర్జీతో మొదలవుతుంది. బాలయ్య, బోయపాటి కాంబోపై ఉన్న మాస్ అంచనాలను ఫస్ట్ ఆఫ్ పూర్తిస్థాయిలో న్యాయం చేసింది. అఘోర ఎంట్రీ సన్నివేశాలు, తమన్ BGM థియేటర్‌లో మంటలు పుట్టించాయి. ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ కి హైలైట్ అని చెప్పాలి. ఈ బ్లాక్‌లో అఖండ రూపంలో బాలయ్య శివ తాండవం ఆడేశాడు. ఈ యాక్షన్ బ్లాక్, సెకండ్ హాఫ్ పై భారీ సస్పెన్స్‌ను మోసుకెళ్తుంది.
సెకండ్ హాఫ్:
ఇంటర్వెల్ తర్వాత కథనం డ్రామాటిక్‌గా టర్న్ తీసుకుంటుంది. ఆది పినిశెట్టి పోషించిన నేత్ర పాత్ర సెకండాఫ్‌లో ఎంట్రీ ఇస్తుంది. బాలయ్యకు గట్టి పోటీ ఇవ్వడంలో ఆది సక్సెస్ అయ్యాడు. కథనం కొన్ని చోట్ల నెమ్మదించిన ఫీలింగ్ కలిగించినప్పటికీ, అఖండ పాత్ర కనిపించిన ప్రతిసారి, మాస్ ఎలివేషన్స్‌తో ఆ లోటును భర్తీ చేశారు. సనాతన ధర్మం, హిందుత్వం, రాజకీయాలపై అఖండ పాత్ర పలికే డైలాగ్స్ చప్పట్లు కొట్టించేలా ఉన్నాయి. క్లైమాక్స్ ఫైట్, బాలకృష్ణ నట విశ్వరూపంతో థియేటర్‌ను దద్దరిల్లేలా ముగుస్తుంది.
ప్లస్ పాయింట్స్:
*అఘోర పాత్రలో బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్
*ఆది పినిశెట్టి పర్ఫార్మెన్స్
*తమన్ BGM సినిమాకు బ్యాక్‌బోన్
*సినిమాటోగ్రఫీ & ఆర్ట్ వర్క్
*శివుడు, హనుమాన్ రిఫరెన్స్
మైనస్ పాయింట్స్:
*ఫస్ట్ ఆఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు.
*హర్షాలి మల్హోత్రా తెలుగు డబ్బింగ్.
ఫైనల్ పాయింట్:
అఖండ 2 అనేది పూర్తిగా మాస్ ఆడియన్స్‌కు టార్గెట్ చేసిన సినిమా. లాజిక్ గురించి ఆలోచించకుండా, మాస్ ఎలివేషన్స్, హై వోల్టేజ్ యాక్షన్, బాలయ్య నట విశ్వరూపం కోరుకునేవారికి ఈ సినిమా పక్కా బ్లాక్‌బస్టర్ ట్రీట్. బాలయ్య, బోయపాటి తమదైన స్టైల్‌లో మరోసారి వాళ్ళది హిట్ కాంబినేషన్ అని ప్రూవ్ చేసుకున్నారు.
తెలుగు ప్రభ రేటింగ్: 3/5

