Tuesday, July 2, 2024
Homeచిత్ర ప్రభAkkineni award to Varun Sandesh: వరుణ్ సందేశ్ కు అక్కినేని యువ ఎక్సలెన్స్...

Akkineni award to Varun Sandesh: వరుణ్ సందేశ్ కు అక్కినేని యువ ఎక్సలెన్స్ అవార్డ్

చలన చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ తీసుకు రావడంలో కీలక పాత్ర వహించిన మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు అని అన్నారు ప్రముఖ సినీ నటుడు ఎం. మురళీ మోహన్..
ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో, జూబ్లీహిల్స్ ఫిలిం నగర్ ఛాంబర్ జరిగిన అక్కినేని శత జయంతి, అక్కినేని యువ హీరోగా ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆకృతి ఏర్పాటు చేసిన “అక్కినేని యువ ఎక్సలెన్సు అవార్డు” ను ప్రముఖ యువహీరో హీరో వరుణ్ సందేశ్ కు ప్రదానం చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మురళీ మోహన్ వరుణ్ సందేశ్ కు అవార్డు ప్రదానం చేసి ప్రసంగించారు.. ఎనభియి సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం లో అక్కినేని ఎన్నో అపురూప మయిన పాత్రలు ధరించి తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడు అయ్యారన్నారు.. కేవలం ఆయన కోసమే సృష్టించిన పాత్రలు ఎన్నో వున్నాయి అంటూ ప్రస్తుతించారు.. దేవదాస్ పాత్ర ను చేసిన ఇతర భాషా నటులు కూడా ఆయన నటనకు నీరాజనాలు పలికిన సదర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.. ఆయన ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి కూడా అంటూ ప్రశంసించారు.. సభను ప్రారంభించిన తెలంగాణ కంగ్రేస్ కో కన్వీనర్ ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతు అక్కినేని తన నటనతో ఎందరికో ఆరాధ్యుడు అయ్యారన్నారు.. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఎన్నో అత్యున్నత పురస్కారాలతో గౌరవించింది అన్నారు.

ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ లాంటి యువ నటున్ని గుర్తించి సత్కరించడం సంతోషకరం అన్నారు.. ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ అక్కినేని ఒక యువ హీరో గా సినీ రంగ ప్రవేశ దినం రోజున వరుణ్ సందేశ్ లాంటి ఒక యువ హీరో కు అక్కినేని యువ పురస్కారం ఇవ్వడం ఎంతో అవుచిత్యంగా వుందన్నారు.. అవార్డులను రూపకల్పన చేయడం లో ఆకృతి విశేష మైన అనుభవం వుందన్నారు.. గౌరవ అతిథి గా పాల్గొన్న నిర్మాతల మండలి కార్య దర్శి ప్రసన్నకుమార్ ప్రసంగిస్తూ అక్కినేని, ఎన్టీర్ ఇద్దరు తెలుగు పరిశ్రమను అత్యున్నస్థాయి లో నిలబెట్టిన మహానటులు అంటూ ప్రశంసించారు.. వరుణ్ సందేశ్ ప్రతి స్పందన తెలియ జేస్తు, ఈ అవార్డ్ ను ఒక మహానటుడి ఆశీర్వాదంగా స్వీకరిస్తున్నా ను అంటూ భావోద్వేగానికి లోనయ్యారు..ఆకృతి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయత్రి డా. కె వి కృష్ణ కుమారి, జూబ్లీ హిల్స్ వాసవి క్లబ్ స్థాపక అధ్యక్షుడు కొత్త వేంకటేశ్వర రావు, సినీ దర్శకుడు రాజేష్ పాల్గొన్నారు.. అక్కినేని, వరుణ్ సందేశ్ అభిమానులు ఈ కార్య క్రమం లో పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News