Thursday, July 10, 2025
Homeచిత్ర ప్రభAllu aravind: అల్లు కుటుంబానికి షాక్: బ్యాంక్ స్కామ్‌లో అల్లు అరవింద్ పేరు..!

Allu aravind: అల్లు కుటుంబానికి షాక్: బ్యాంక్ స్కామ్‌లో అల్లు అరవింద్ పేరు..!

Allu family bank scam news: తెలుగు చిత్ర పరిశ్రమలో సుస్థిర స్థానం సంపాదించుకున్న అల్లు కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్ కేసులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పేరు ప్రస్తావనకు రావడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

ఈడీ విచారణకు అల్లు అరవింద్:

రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అల్లు అరవింద్‌ను విచారించారు. దాదాపు మూడు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది, ఆయన స్టేట్‌మెంట్‌ ను ఈడీ అధికారులు నమోదు చేసుకున్నారు. వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని అల్లు అరవింద్‌ను ఆదేశించినట్లు సమాచారం.

బ్యాంక్ స్కామ్ వివరాలు:

ఈ బ్యాంక్ స్కామ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించినది. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థ బ్యాంక్ నుంచి ₹101.48 కోట్ల రుణాన్ని తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మనీలాండరింగ్ కోణం ఉందని అనుమానిస్తున్న ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా విచారణ ప్రారంభించింది.

2024లో హైదరాబాద్, కర్నూలు, ఘజియాబాద్‌లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి, దాదాపు ₹1.45 కోట్ల నగదును సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్ అధికారులు పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేశారని, ఆర్‌బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసు విచారణలో అల్లు అరవింద్ పేరు ఆ సంస్థ లావాదేవీల్లో ప్రస్తావించబడటంతో ఈడీ ఆయనను విచారణకు పిలిపించింది. అయితే, ఈ సంస్థతో అల్లు అరవింద్‌కు ప్రత్యక్ష సంబంధం ఉందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అల్లు అరవింద్ తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతలలో ఒకరుగా కొనసాగుతున్నారు. దివంగత ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన, గీత ఆర్ట్స్ బ్యానర్‌ను స్థాపించారు. ఈ బ్యానర్‌పై అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించి, పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆయన ముగ్గురు కుమారుల్లో అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తుండగా, అల్లు శిరీష్ కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News