Homeచిత్ర ప్రభAllu Arjun: కుటుంబంతో సహా ముంబైకి బన్నీ మకాం.. అల్లు అరవింద్‌ ఏమన్నారంటే!

Allu Arjun: కుటుంబంతో సహా ముంబైకి బన్నీ మకాం.. అల్లు అరవింద్‌ ఏమన్నారంటే!

Allu Arjun: ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం రాకా చిత్రంతో బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వం రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుగుతోంది. రాకాతో పాటు తమిళ్ డైరెక్టర్‌ బాసిల్‌ జోసెఫ్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు బన్ని. అంతేకాదు మరిన్ని స్క్రిప్ట్స్‌ కూడా వింటున్నట్టు సమాచారం. అయితే, అల్లు అర్జున్‌ రాకా షూటింగ్‌ కోసం తరచూ ముంబై వెళ్లి వస్తున్నాడు.

- Advertisement -

ముంబైకి అల్లు అర్జున్ షిఫ్ట్?
ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత జీవితం గురించిన ఓ ఆసక్తికర విషయంపై సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. అదే అల్లు అర్జున్‌ ముంబైకి షిఫ్ట్‌ అవుతున్నాడంటూ నెట్టింట తెగ ప్రచారం జరుగుతుంది. తన భార్య, పిల్లలతో కలిసి తాత్కాలికంగా ముంబైకి షిఫ్ట్‌ అవుతున్నట్టు టాక్‌ వినిపిస్తుంది. ఇది తెలిసి బన్ని ఫ్యాన్స్‌ అంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్‌ ఈ అంశంపై స్పందించారు.

అల్లు అరవింద్ క్లారిటీ!
తాజాగా ఓ అంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌ ముంబై మకాం గురించి స్పష్టం చేశారు. “బన్ని ముంబైకి వెళ్తున్నాడని, అక్కడే కుటుంబంతో స్థిరపడుతున్నారంటూ కథనాలు వస్తున్నాయి. అవి నేను కూడా చూశాను. కానీ ఈ వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్‌ ఎక్కువ భాగం ముంబైలోనే జరుగుతుంది. అందువల్లే చాలా మందికి ఇలా అనిపించవచ్చు. కానీ, ముంబైకి షిఫ్ట్‌ అవ్వాలనే ఆలోచన బన్నికి లేదు.

బన్నికి ఆ ఆలోచనే లేదు
అతడి మనసు ఎప్పుడూ హైదరాబాద్‌ చూట్టూనే తిరుగుతుంది. సొంత ఇల్లు ఇక్కడే ఉంది. పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. తన స్నేహితులంతా కూడా హైదరాబాద్‌లోనే ఉన్నారు. అలాంటప్పుడు ముంబైకి ఎందుకు వెళ్తాడు. ప్రస్తుతం షూటింగ్‌ పనుల వల్ల ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నాడు. అంతే తప్పా ముంబైకి వెళ్లాలనే ఆలోచన అసలు తనకి లేదు” అని ఆయన తెలిపారు. దీంతో బన్ని ఫ్యాన్స్‌ అంత ఊపిరి పిల్చుకుంటున్నారు.

Also Read: Karunakaran: ‘తొలి ప్రేమ’ డైరెక్టర్‌ రీఎంట్రీ… బెల్లంకొండ హీరోతో క్రేజీ లవ్‌స్టోరీ!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News