Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSri Tej: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్

Sri Tej: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్(Sri Tej) ఇప్పుడిప్పుడకే కోలుకుంటున్నాడు. ఇటీవల కిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన వైద్యులు ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. రిహాబిలిటేషన్ కేంద్రంలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind), బన్నీ వాసు పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

శ్రీతేజ్ యోగక్షేమాలను అల్లు అరవింద్, బన్నీ వాసు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. శ్రీతేజ్ ఆసుపత్రి ఖర్చులతో పాటు, కుటుంబానికి హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీస్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్‌లు ఆర్థికంగా సహాయం చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad