Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఓ వార్త ఈ మధ్య సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. అల్లు అర్జున్ కలవాలంటే 42 నిబంధనలు పాటించాలని వచ్చిన ఆరోపణలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. అది విని నెటిజన్స్ అల్లు అర్జున్‌ని ఉద్దేశిస్తూ రకరకాల కామెంట్స్ చేశారు. అయితే వాటిని ఆయన టీం ఖండించింది. కానీ, తాజా వీడియోతో మరోసారి అల్లు అర్జున్ వివాదంలో నిలిచారు. గతంలో ఓ పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరీ బారువా అల్లు అర్జున్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
బన్నీ కలవడానికి 42 రూల్స్
ఆయనను కలవడానికి ముందుగా తమకు 42 నిబంధనలతో కూడిన ప్రోటోకాల్ లిస్ట్ ఇచ్చారని, ఆయనతో మాట్లాడే విధానం నుంచి ఫోటోషూట్ వరకు అనేక నియమాలు పాటించాల్సి వచ్చిందని ఆమె చెప్పడం ఇండస్ట్రలో సంచలనంగా మారాయి. ఆమె వ్యాఖ్యలు విని చాలా మంది యాంటీ ఫ్యాన్స్ అల్లు అర్జున్‌ని ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఆయనపై తీరు తప్పుబడుతూ విమర్శలు చేశారు. బన్నీ కాస్తా వ్యతిరేకత వస్తుండటంతో ఆయన పీఆర్ టీం స్పందించింది. బారువా వ్యాఖ్యలు ఖండించింది. అల్లు అర్జున్ అందరితో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారని, ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.
అల్లు సినిమాస్ వీడియో వైరల్
ఇదే సమయంలో టాలీవుడ్‌కు చెందిన కొందరు ప్రముఖులు కూడా అల్లు అర్జున్‌కు మద్దతుగా మాట్లాడారు. ఆయనను ఎప్పుడు కలిసినా సరదాగా మాట్లాడతారని, ఇలాంటి కఠిన నియమాలు ఎప్పుడూ చూడలేదని చెప్పారు. దీంతో కావేరీ బారువా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కోకాపేటలో అల్లు సినిమాస్ ప్రారంభోత్సవం సందర్భంగా బన్ని తన భార్య స్నేహరెడ్డితో కలిసి హాజరయ్యాడు. ఈ సందర్భంగా వారిద్దరు లోపలికి నడుచుకుంటూ వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో అల్లు అర్జున్,స్నేహలు ముందు నడుస్తుండగా.. ఆయన టీం, మేనేజర్ వెనకాల నడుస్తూ వస్తున్నారు.
Also Read: Arjun Das: గుండె ముక్కలు చేసి వేళ్లిపోతారు.. బ్రేకప్ పోస్ట్‌తో షాకిచ్చిన అర్జున్ దాస్
అయితే బన్నీ వెనక్కి తిరిగి చూడగా.. ఒక్కసారిగా అందరు ఆగిపోయి.. వారి కాస్తా దూరంగా జరిగారు. అనంతరం అదే డిస్టెన్స్‌తో బన్నీని ఫాలో అవుతూ ముందుకు వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో బన్నీ తీరు చూసి అయితే గతంలో కావేరి బారువా చేసిన కామెంట్స్ నిజమేని, బన్నీకి నిజంగానే కఠిన ప్రోటోకాల్ ఉందని అంటున్నారు. ‘అల్లు అర్జున్ కంటి సైగతోనే వాళ్లను ఆపేశారు’, ‘భాయ్ పక్కన నడవడానికి ఎంత ధైర్యం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో గతంలో వచ్చిన 40కి పైగా ప్రోటోకాల్ నిబంధనల వార్తలు నిజమేనా అనే చర్చ మరోసారి మొదలైంది.
Allu couple at the #AlluCinemas launch.@alluarjun @GeethaArts pic.twitter.com/5C9P2RMnfw
— M9 NEWS (@M9News_) March 12, 2026

