Friday, June 6, 2025
Homeచిత్ర ప్రభAllu Arjun: గెట్ రెడీ.. అల్లు అర్జున్- అట్లీ సినిమా నుంచి రేపు అప్డేట్

Allu Arjun: గెట్ రెడీ.. అల్లు అర్జున్- అట్లీ సినిమా నుంచి రేపు అప్డేట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) అభిమానులకు క్రేజీ న్యూస్ వచ్చేసింది. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో బన్నీ భారీ బడ్జెట్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. రేపు ఉదయం 11 గంటలకు ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ రానుందని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో ఓ చెయ్యి కత్తిని పట్టుకొని ఉంది. దీంతో ఆ అప్టేట్ ఏమై ఉంటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

స్పైడర్‌మాన్, బ్యాట్‌మాన్, అవతార్, రోబో మూవీల తరహాలో కొత్త టెక్నాలజీని వాడుకుని ఈ మూవీ చేయనున్నారు. ఇక ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని ఇందులో కేవలం గ్రాఫిక్స్ కే దాదాపు రూ.150 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని సమాచారం. దీంతో అభిమానుల ఊహలకు అందని రీతిలో హాలీవుడ్ తరహాలో విజువల్స్‌ ఉండనున్నాయని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారనే టాక్ నడుస్తోంది.

కాగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో తీసిన ’జవాన్’ సినిమాతో బ్లాక్‌బాస్టర్ అందుకున్నాడు అట్లీ. ఆ మూవీ ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరోవైపు అల్లు అర్జున్ ‘పుష్ప2’ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఇండస్ట్రీ హిట్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News