సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్(Allu Arjun) బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఈ కేసులో తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని బన్నీ నాంపల్లి కోర్టులో(Namaplly Court) పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరడంతో తదుపరి విచారణను జనవరి 10వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
కాగా ఈ కేసులో నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే తెలంగాణ హైకోర్టు(TG HighCourt) నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బన్నీ జైలు నుంచి విడుదలయ్యారు. తాజాగా రిమాండ్ గడువు ముగియడంతో వర్చువల్‌గా అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు.