సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ (Allu Arjun) బౌన్సర్ ఆంటోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు తొక్కిసలాటకు ప్రధాన కారణం అతడేనని పోలీసులు భావిస్తున్నారు. రెండు రోజుల క్రితమే అతడిని అరెస్ట్ చేయగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది.
- Advertisement -
మరోవైపు ఇప్పటికే ఈ కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్ ఇటీవల జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో పోలీసుల విచారణకు హాజరయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన విచారణలో పోలీసులు ఏ ప్రశ్న అడిగినా.. తెలియదు.. మర్చిపోయాను అని సమాధానం ఇచ్చినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.