Sunday, December 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Allu Arjun| ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఎందుకంటే..?

Allu Arjun| ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఎందుకంటే..?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. రేపు(మంగళవారం) దీనిపై విచారణ చేపడతామని తెలిపింది.

- Advertisement -

కాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్‌ నంద్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తూ నంద్యాలకు వచ్చిన బన్నీ.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, తన మిత్రుడు శిల్పా రవికుమార్ ఇంటికి వచ్చారు. ఆయనను గెలిపించాలని కోరారు. అయితే అల్లు అర్జున్ సుమారు గంటన్నరకు పైగా అక్కడే గడిపారు. ఈ సమయంలో బన్నీని చూసేందుకు వేలాదిగా అభిమానులు అక్కడి తరలివచ్చారు.

అయితే స్టార్ హీరో అయిన అల్లు అర్జున్‌.. ఎన్నికల సమయంలో అక్కడకు రావడంతో భారీగా ఫ్యాన్స్‌ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ బన్నీ ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకపోవడంతో నంద్యాల పోలీసులు కేసు నమోదుచేశారు. అల్లు అర్జున్‌తో పాటు శిల్పారవిపై ఐపీసీ సెక్షన్‌ 188 కింద కేసు పెట్టారు. తాజాగా పోలీసులు తనపై నమోదుచేసిన ఈ కేసును కొట్టి వేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో బన్నీ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మరి ఈ పిటిషన్‌పై ధర్మాసనం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప2(PUSHPA2)’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోసర్లు, లిరికల్ సాంగ్స్ అభిమానులను ఉర్రుతలుగిస్తున్నాయి. కాగా ‘పుష్ప’ సినిమాతో ఉత్తమ నటుడిగా బన్నీకి నేషనల్ అవార్డు రావడంతో పుష్ప2 సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ఊహించని స్థాయిలో అమ్ముడుపోయాయని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News