Allu Arjun-Pavala Shyamala: నటి పావలా శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లేడీ కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన నటనతో నటించి మెప్పించారు. ఎంతో మంది స్టార్ హీరో చిత్రాల్లో ఆమె కీలక పాత్ర పోషించింది. దాదాపు ఎన్నో వందల చిత్రాల్లో నటించి అలరించిన ఆమె ప్రస్తుతం దీనపరిస్థితిలో ఉన్నారు. ఒకప్పుడు నటిగా లక్షల్లో రెమ్యునరేషన్ పొందిన ఆమె ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎంతోకాలంగా తనకు ఆర్థిక సాయం కావాలని ఎంతోమంది హీరోలను, సినీ ఇండస్ట్రీని వేడుకుంటోంది.
మందులు కోనలేని దీనస్థితిలో..
గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం ప్రస్తుతం మరింత విషమించింది. దానికి తోడు మతిస్థితిమితం లేని కూతురు భారం కూడా తనపై ఉండటంతో ఎన్నోసార్లు ఆర్థిక సాయం కోసం అర్చించింది. ప్రస్తుతం తన కూతురితో కలిసి సికిందరాబాద్ కార్ఖానా ప్రాంతంలోని ఆర్కే ఫౌండేషన్‌లో ఆశ్రయం పొందుతున్న శ్యామల ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా మారింది. కనీసం మందులు కూడా కొనుక్కొలేని స్థితిలో ఉంది. అయితే ఆమె పరిస్థితి తెలుసుకున్న స్టార్ హీరో అల్లు అర్జున్ ఆమెకు అండగా నిలిచాడు. పావలా శ్యామల ఆమె కుమార్తె పరిస్థితిని తెలుసుకున్న ఆయన వీరి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ముందుకు వచ్చారు. వారి నిత్యావసరాలు తీర్చేందుకు ప్రతి నెల రూ. 10వేలు ఆర్థిక సహాయం అందేలా అల్లు అర్జున్ ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.
ప్రతినెల రూ.10 వేల ఆర్థిక సాయం..
ఆర్థిక సాయం ఒకేసారి ఇవ్వకుండ ప్రతి నెల తన అవసరాలు నిమిత్తం రూ. 10 వేలు అందించడానికి బన్నీ తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, ఆకాశ్ పూరీ వంటి హీరోలు పావలా శ్యామలాకు ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే. కానీ, అవి తనకు శాశ్వత పరిష్కారం చూపించలేకపోయాయి. దీంతో కష్టాల్లో ఉన్న ఆమెను ఆదుకునేందకు అల్లు అర్జున్ చొరవ తీసుకుని ఆమె ప్రతి నెల డబ్బు సాయం అందేలా తీసుకున్న ఈ చర్యపై చిత్ర పరిశ్రమతో పాటు సామాన్య ప్రజల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Vijay Crishna Died: విషాదం.. ప్రముఖ నటుడు విజయ్ కన్నుమూత

