Homeచిత్ర ప్రభAllu Arjun: మరోసారి గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. ఆమెకు ఆర్థిక భరోసా

Allu Arjun: మరోసారి గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. ఆమెకు ఆర్థిక భరోసా

Allu Arjun: సినీ నటుడు అల్లు అర్జున్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. తీవ్ర ఆర్థిక, అరోగ్య సమస్యలతో బాధపుడుతున్న నటి పావలా శ్యామలకు ప్రతి నెల ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి తండ్రిని కోల్పోయిన ఓ దివ్వాంగురాలికి అండగా నిలిచాడు. వివరాలు.. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జల్లా వేట్లపాలెంలో ఫిబ్రవరి 28న బాణసంచా పేలుళ్ల ఘటనలో కడంపల్లి ధనరాజు అనే వ్యక్తి మరణించాడు.

- Advertisement -

దివ్యాంగురాలికి బన్నీ ఆర్థిక భరోసా 
అప్పటికే అనారోగ్యంతో ఆయన భార్య మరణించింది. దీంతో దివ్యాంగురాలైన అతని కూతురు కడింపల్లి దుర్గ ఇప్పుడు అనాథగా మారింది. దివ్యంగురాలు కావడంతో బంధువులు సైతం ఆమెకు తొడుగా ఉండేందుకు ఎవరు ముందుకు రాలేదు. దీంతో దుర్గ పోషణ కోసం ఆమె జీవితాంతం ఆర్థిక సాయం అందించేందుకు అల్లు అర్జున్ ముందుకు వచ్చారు. ప్రతి నెల ఆమె ఖాతాలో రూ. 7500 చొప్పున జమ అయ్యేలా ఏర్పాటు చేశారు. కాగా తల్లి లేని దుర్గను ఆమె తండ్రి ధనరాజు చాలా జాగ్రత్తగా చూసుకునేవారని గ్రామస్థులు చెబుతున్నారు.

Also Read: Lavanya Tripathi: సోషల్ మీడియాలో వేధింపులు.. పోలీసులను ఆశ్రయించి మెగా కోడలు

తండ్రి మరణంతో అనాథగా
అయితే, పేలుళ్ల ఘటనలో ఆయన మృతి చెందడంతో దుర్గ ఒంటరి అయిపోయింది. ఆమెకు అన్నం పెట్టే వారు కూడా లేకపోవడంతో చాలామంది చలించిపోయారు. అయితే, ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న అల్లు అర్జున్‌ స్పందించారు. నిర్మాత బన్నివాసు ద్వారా తన ‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులను వేట్లపాలెం పంపించారు. అక్కడ వాస్తవ పరిస్థితి తెలుసుకుని ఆయన చలించిపోయారు. దుర్గకు కావాల్సిన సాయం చేయాలని అల్లు అర్జున్‌ నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని బన్నీ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ బొలిశెట్టి సాగర్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News