Thursday, March 12, 2026
Homeచిత్ర ప్రభAllu Cinemas: బాలీవుడ్ మూవీతో అల్లు అర్జున్ మ‌ల్టీప్లెక్స్ ఓపెనింగ్ - ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు

Allu Cinemas: బాలీవుడ్ మూవీతో అల్లు అర్జున్ మ‌ల్టీప్లెక్స్ ఓపెనింగ్ – ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు

Allu Cinemas: టాలీవుడ్ హీరోలు ఒక్కొక్క‌రుగా థియేట‌ర్ బిజినెస్‌ల‌లోకి ఎంట‌ర‌వుతున్నారు. మ‌ల్టీప్లెక్స్‌ల‌ను నిర్మిస్తున్నారు. మ‌హేష్‌బాబు, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌వితేజ‌తో పాటు మ‌రికొంద‌రు హీరోలు మ‌ల్టీప్లెక్స్‌ల‌ను స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా ఏఏఏ పేరుతో హైద‌రాబాద్‌లోని అమీర్‌పేట‌లో ఓ మ‌ల్టీప్లెక్స్‌ను నిర్మించాడు. ఈ మ‌ల్టీప్లెక్స్ స‌క్సెస్‌తో హైద‌రాబాద్‌లో మ‌రో వ‌ర‌ల్డ్ క్లాస్ థియేట‌ర్‌ను ఓపెన్ చేయ‌బోతున్నారు అల్లు అర్జున్‌. అల్లు సినిమాస్ పేరుతో హైద‌రాబాద్‌లోని కోకాపేట‌లో నిర్మించిన ఈ మ‌ల్టీప్లెక్స్ నిర్మాణం ఇప్ప‌టికే పూర్త‌య్యింది. అత్యాధునిక హంగుల‌తో ఆడియెన్స్‌కు స‌రికొత్త థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను అందించేలా అల్లు సినిమాస్ ఉండ‌బోతున్న‌ట్లు తెలిసింది.

- Advertisement -

75 అడుగుల వెడ‌ల్సుతో దేశంలోనే అతిపెద్ద స్క్రీన్‌తో అల్లు సినిమాస్ మొద‌లుకానుంది. నాలుగు స్క్రీన్ల‌తో కూడిన ఈ మ‌ల్టీప్లెక్స్‌లో డాల్బీ అట్మాస్‌, డాల్బీ విజ‌న్ త్రీడీతో పాటు ప‌లు సాంకేతిక హంగుల‌న్నీ ఈ మ‌ల్టీప్లెక్స్‌లో ఉండ‌నున్నాయ‌ట‌. ఇటీవ‌లే అల్లు సినిమాస్ ట్ర‌య‌ల్‌ర‌న్ నిర్వ‌హించారు. సినీ ప్ర‌ముఖుల‌కు ఈ థియేట‌ర్‌లో స్సెష‌ల్ షో వేశారు. ఈ షోకు రాజ‌మౌళి, వినాయ‌క్ స‌హా టాలీవుడ్‌లోని ప‌లువురు డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్ల‌తో పాటు యాక్ట‌ర్లు అటెండ్ అయ్యారు.

Also Read – Ranveer Singh: ‘డాన్ 3’ నుంచి రణ్ వీర్ సింగ్ అవుట్? అదే కారణమా!

కాగా అల్లు సినిమాస్‌ను అఫీషియ‌ల్‌గా మార్చి 19 నుంచి ఓపెన్ చేయాల‌ని అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ర‌ణ‌వీర్‌సింగ్ ధురంధ‌ర్ 2 సినిమాతో ఈ మ‌ల్టీప్లెక్స్ లాంఛ్ కానుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అదే రోజు రిలీజ్ కానున్న టాక్సిక్ మూవీ కూడా ఈ థియేట‌ర్‌లో రిలీజ్ కానున్న‌ట్లు చెబుతున్నారు.

టాలీవుడ్ మూవీస్‌తో కాకుండా ప‌రభాష సినిమాల‌తో మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్‌ను ఓపెన్ చేయనుండ‌టంపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తెలుగు హీరో నిర్మించిన మ‌ల్టీప్లెక్స్‌ను తెలుగు సినిమాతో కాకుండా హిందీ, క‌న్న‌డ సినిమాల‌తో ప్రారంభించాల‌ని అనుకోవ‌డం క‌రెక్ట్ కాద‌ని అంటున్నారు. మార్చి 26న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాతో అల్లు సినిమాస్‌ను ఓపెనింగ్ చేస్తే బాగుంటుంద‌ని అంటున్నారు. నెటిజ‌న్ల ట్వీట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

Also Read – Akira Nandan: అకీరా నందన్ కోసం శేఖర్ కమ్ముల?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News