సంధ్య థియేటర్ ఘటనలో పోలీసుల విచారణ నిమిత్తం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు హీరో అల్లు అర్జున్ చేరుకున్నారు. పోలీసులు బందోబస్తు మధ్య జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి కారులో చిక్కడపల్లి బన్నీ బయలుదేరారు. అల్లు అర్జున్‌తో పాటు బన్నీ వాసు, ఆయన లాయర్ అశోక్ రెడ్డి ఉన్నారు. మరో కారులో బన్నీ తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.
అయితే పోలీస్ స్టేషన్ లోపలికి కేవలం అల్లు అర్జున్ కారును మాత్రమే పోలీసులు అనుమతించారు. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా మోహరించారు పోలీసులు. మరోవైపు పోలీస్ స్టేషన్ సమీపంలోని రోడ్లన్నీ బ్లాక్ చేసి.. పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. బన్నీని సెంట్రల్ జోన్ డీసీపీ, చిక్కడపల్లి ఏసీపీ రమేశ్, సీఐ రాజు నాయక్ విచారించనున్నారు.