Allu Arjun: టీవీ షోలో అంత్యంత ఆదరణ పొందిన టీవీ షో శక్తిమాన్. ఈ 90’sలో దూరదర్శన్‌లో ఈ షోకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అన్ని భాషల్లోనూ ఈ షో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా చిన్నపిల్లలను విపరీతంగా మెప్పించింది ఇది. అయితే ఈ షో ఆధారంగా ఇప్పుడు ఓ భారీ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ తమిళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. శక్తిమాన్‌ని మళ్లీ పెద్ద తెరపై చూపించబోతున్నట్టు స్వయంగా అతడే ప్రకటించాడు. శక్తిమాన్ మూవీకి అల్లు అర్జున్ హీరోగా చేస్తున్నట్టు గతంలో వార్తలు వినిపించాయి.
శక్తిమాన్ నుంచి రణ్‌బీర్ అవుట్!
అయితే, అది నిజం కాదని, ‘శక్తిమాన్’ పూర్తిగా బాలీవుడ్ రణ్‌వీర్ సింగ్ చిత్రమని చెప్పి క్లారిటీ ఇచ్చాడు. అయితే అసలేమైందో తెలియదు. కానీ, రణ్‌బీర్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్టు మళ్లీ వార్తలు వచ్చాయి. దర్శకుడు-హీరోకి మధ్య కొన్ని మనస్పర్థలు తలెత్తినట్టు సమాచారం. స్క్రిప్ట్, బడ్జెట్, కథను ఎలా చూపించాలి అనే అంశాలపై దర్శకుడు హీరో మధ్య విభేదాలు రావడంతో రణ్‌వీర్ సింగ్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడట. దీంతో ఈ సినిమా ప్రారంభ దశలో నిలిచిపోయింది. అయితే ఇప్పుడీ ఈప్రాజెక్ట్‌లోకి అల్లు అర్జున్ ఎంట్రీ ఇస్తున్నట్టు ఫిలిం దునియాలో టాక్ వినిపిస్తోంది. శక్తిమాన్ కోసం ఇటీవల బాసిల్ అల్లు అర్జున్‌ని సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
బాసిల్ బన్నీ గ్రీన్ సిగ్నల్
దీంతో శక్తిమాన్‌కి బన్నీ ఫిక్స్ అయ్యాడని నెట్టింట తెగ ప్రచారం జరుగుతుంది. కాగా పుష్పతో భారీ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌పై అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో బన్నీ ఓ భారీ చిత్రం చేయబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ, అందులో నిజం లేదన్నారు. కానీ, ఇప్పుడు ఆ రూమర్సే నిజం అవుతూ వీరిద్దరి కాంబో సెట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. శక్తిమాన్ సినిమాను భారీ స్థాయిలో రూపొందించేందుకు Sony Pictures India ముందుకొచ్చింది. భారతదేశంలోనే మొదటి సూపర్ హీరోగా గుర్తింపు పొందిన శక్తిమాన్ కథను ఆధునిక టెక్నాలజీతో భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు జోసెఫ్ భారీగా ప్లాన్ చేస్తున్నాడట.
శక్తిమాన్ పాత్రను మొదట ముఖేష్ ఖన్నా పోషించారు. ఈ సూపర్ హీరో సిరీస్ గా వచ్చిన ఈ షో దూరదర్శన్‌లో 1997 నుంచి 2005 వరకు ప్రసారమైంది. సాధారణ వ్యక్తి అయిన గంగాధర్ అనే పాత్ర, అవసరమైనప్పుడు శక్తిమాన్‌గా మారి చెడును ఎదుర్కొనే కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఈ సిరీస్‌ను ఆసక్తిగా చూసేవారు. అయితే శక్తిమాన్‌ని సినిమా తీసుకువచ్చేందుకు కథను మోడ్రన్ స్టైల్లో రీబూట్ చేసి హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ రూపొందించబోతున్నారట. దీనిని సూపర్ హీరో ఫ్రాంచైజ్‌గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన లేదు. మరి దీనిపై మూవీ టీం, అల్లు అర్జున్ నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి.

