Thursday, July 10, 2025
Homeచిత్ర ప్రభAllu Arjun: 'తెలుగు వారంటే వైల్డ్ ఫైర్'.. అల్లు అర్జున్ డైలాగ్ వైరల్

Allu Arjun: ‘తెలుగు వారంటే వైల్డ్ ఫైర్’.. అల్లు అర్జున్ డైలాగ్ వైరల్

Allu Arjun in America: అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నాట్స్ 2025 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సినీ సెలబ్రెటీలు సందడి చేశారు. నటసింహం నందమూరి బాలకృష్ణ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్యూట్ బ్యూటీ శ్రీలల, ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, సుకుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

ఇంతమంది తెలుగు వారిని అమెరికాలో ఒక్కచోట చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని బన్నీ తెలిపారు. మిమ్మల్ని చూస్తుంటే హైదరాబాద్ లేదా విశాఖపట్నంలో ఉన్నట్లు ఉందన్నారు. విదేశాల్లోనూ తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతున్న మీకు ధన్యవాదాలు చెప్పారు. ఇండియన్స్ ఎక్కడున్నా తగ్గేదేలే..అందులో తెలుగోళ్లు అసలు తగ్గేదేలే అంటూ ఉత్సాహపరిచారు. అలాగే పుష్ప మూవీ డైలాగులు తనదైన శైలిలో చెప్పి ఆకట్టుకున్నారు. నాట్స్ అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్, తెలుగు వారంటే ఫైర్ అనుకున్నా.. వైల్డ్ ఫైర్ అంటూ చెప్పగానే సభ ప్రాంగణమంతా చప్పట్లతో దుమ్మురేగింది.

మరోవైపు తాను ఇండస్ట్రీకి పరిచయం చేసిన అల్లు అర్జున్, శ్రీలీల ఈ వేదికపై ఉండటం ఆనందంగా ఉందని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే తాను తీసిన ‘1 నేనొక్కడినే’ చిత్రాన్ని అమెరికాలో ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉంటానని మరో దర్శకుడు సుకుమార్ తెలిపారు.

Also Read: టాలీవుడ్ 2025 ఫ‌స్ట్ హాఫ్ రిపోర్ట్

ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ఆయన నటించిన ‘పుష్ప2’ మూవీ ఇండస్ట్రీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. ముఖ్యంగా తన నటనతో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాడు. రూ.1700కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది. దీంతో బన్నీ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పాకింది. ఈ క్రమంలో తన తదుపరి సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ మీద రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News