Allu Arjun Neel Combo: పుష్ప 2 మూవీతో పాన్ ఇండియన్ లెవెల్‌లో రికార్డులు తిరగరాశాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 1800 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇండియన్ సినిమా హిస్టరీలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ ఫైవ్ సినిమాల్లో ఒకటిగా పుష్ప 2 నిలిచింది.
టాప్ డైరెక్టర్లు…
పుష్ప 2 బ్లాక్‌బస్టర్ తర్వాత అల్లు అర్జున్‌తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్, శాండల్‌వుడ్‌తో పాటు వివిధ భాషలకు చెందిన టాప్ డైరెక్టర్లు ఆసక్తిని చూపుతోన్నారు. ప్రస్తుతం కోలీవుడ్ అగ్ర దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు.
రావణం…
తాజాగా అల్లు అర్జున్ మరో సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రివీలైంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో అల్లు అర్జున్ కాంబో ఫిక్సయ్యింది. వీరిద్దరి కలయికలో ఓ సినిమా చేయబోతున్నట్లు నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు. ఈ సినిమాకు రావణం అనే పేరును ఫిక్స్ చేసినట్లు వెల్లడించారు. మైథలాజికల్ యాక్షన్ మూవీగా రావణం ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పీరియాడికల్ మూవీ…
ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమాతో పాటు ప్రభాస్ సలార్ 2 కూడా కమిట్ అయ్యాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే రావణం మూవీని సెట్స్‌పైకి తీసుకురాబోతున్నట్లు సమాచారం.
రొమాంటిక్ యాక్షన్…
మరోవైపు అల్లు అర్జున్ కూడా అట్లీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. రొమాంటిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. దాదాపు 800 కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్ సినిమాలకు ధీటుగా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ హంగులతో ఈ మూవీని తెరకెక్కిస్తోన్నట్లు సమాచారం.
అల్లు అర్జున్, అట్లీ మూవీలో దీపికా పదుకోణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. కల్కి 2898 ఏడీ తర్వాత తెలుగులో ఆమె నటిస్తున్న మూవీ ఇది. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 22వ సినిమా ఇది.
అట్లీ మూవీతో పాటు సందీప్ వంగా, త్రివిక్రమ్, సుకుమార్‌లతో అల్లు అర్జున్ సినిమాలు చేయాల్సివుంది.