Monday, February 16, 2026
Homeచిత్ర ప్రభAllu Sirish: పెళ్లి తర్వాతే అల్లు శిరీష్‌.. ‘మ‌గ‌జాతి ఆణిముత్యం’

Allu Sirish: పెళ్లి తర్వాతే అల్లు శిరీష్‌.. ‘మ‌గ‌జాతి ఆణిముత్యం’

Allu Sirish: అల్లు శిరీష్ హీరోగా మారి ప‌ద‌మూడేళ్లు దాటిపోయింది. 2013లో వ‌చ్చిన గౌర‌వం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శిరీష్ ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం ఎనిమిది సినిమాలు మాత్ర‌మే చేశాడు. ఈ సినిమాల‌న్నీ డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తోనే రూపొందినా, శిరీష్‌కు మాత్రం హిట్టు అందివ్వ‌లేక‌పోయాయి. చివ‌ర‌గా 2024లో బ‌డ్డీ సినిమాలో న‌టించాడు శిరీష్‌. ఫాంట‌సీ యాక్ష‌న్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. బ‌డ్డీ త‌ర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న శిరీష్ ఓ కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన ఓ రొమాంటిక్ మూవీ చేయ‌బోతున్నాడు.

- Advertisement -

శిరీష్ హీరోగా న‌టించ‌నున్న ఈ మూవీకి మ‌గ‌జాతి ఆణిముత్యం అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం. సోలో బ‌తుకే సో బెట‌ర్, బ‌చ్చ‌ల‌మ‌ల్లి ఫేమ్ సుబ్బు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. హాస్య ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రాజేష్ దండా ఈ సినిమాను నిర్మించ‌నున్నారు.

Also Read- Mega158: బాబీ, చిరు చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా మోహన్ లాల్?

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మ‌గ‌జాతి ఆణిముత్యం మూవీ రూపొంద‌బోతున్న‌ట్లు స‌మాచారం. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు దాదాపు ఎండింగ్‌కు చేరాయ‌ట‌. శిరీష్ పెళ్లి త‌ర్వాత ఏప్రిల్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను మొద‌లుపెట్టేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైనింగ్‌గా శిరీష్ క్యారెక్ట‌ర్ ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

త్వ‌ర‌లోనే శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మార్చి 6న ప్రియురాలు న‌య‌నికతో అల్లు శిరీష్ పెళ్లి జ‌రుగ‌బోతుంది. ఇటీవ‌లే పెళ్లి డేట్‌ను శిరీష్ అనౌన్స్‌చేశాడు. దుబాయ్‌లో గ్రాండ్‌గా శిరీష్, న‌య‌నిక పెళ్లి జ‌రుగ‌నున్న‌ట్లు స‌మాచారం. పెళ్లి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ ప్ర‌స్తుతం దుబాయ్‌లోనే ఉన్నారు. గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో వీరి ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. రెండేళ్లుగా న‌య‌నిక‌తో ప్రేమ‌లో ఉన్న శిరీష్ పెద్ద‌ల అంగీకారంతో ఆమెతో ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడు. శిరీష్, న‌య‌నిక పెళ్లికి మెగా ఫ్యామిలీతో పాటు మ‌రికొంత‌మంది బంధువులు మాత్ర‌మే అటెండ్ కానున్నార‌ట‌. పెళ్లి త‌ర్వాత హైద‌రాబాద్‌లో గ్రాండ్ రిసెప్ష‌న్‌ను ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది.

Also Read- Sravanthi Chokarapu: పచ్చని చీరలో స్రవంతి పరవశం.. ముత్యాల మెరుపులతో మైమరపిస్తున్న యాంకర్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News