Aishwarya Rai and Abhishek Bachchan | బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల విడాకుల వ్యవహారం కొంతకాలంగా చర్చనీయంశంగా మారిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ తో అభిషేక్ రిలేషన్ షిప్ లో ఉన్నాడని, అందుకే వీరిద్దరూ విడిపోబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని యూట్యూబ్ చానళ్ళు, వెబ్సైట్లు ఇంకో అడుగు ముందుకెళ్లి.. అభిషేక్-నిమ్రత్ ల ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని వార్తలు ప్రచారం చేస్తున్నాయి. అంతేనా…? నిమ్రత్ పండంటి బచ్చన్ వారసుడికి జన్మనివ్వబోతుందని, అసలు ఐష్, అభిషేక్ ల విడాకులకు ఇదే ప్రధాన కారణం కూడా కావచ్చని వార్తలు వండి వడ్డిస్తున్నాయి.
పలు బాలీవుడ్ మూవీ ఫంక్షన్లకి, అంబానీ ఇంట పెళ్ళికి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai), ఆరాధ్య ఒకటిగా వెళుతుంటే… బచ్చన్ ఫ్యామిలీ సపరేట్ గా వెళుతోంది. వీరు ఎక్కడా కలిసి కనిపించకపోవడంతో విడాకుల వార్తలు నిజమేనేమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇవి చాలదన్నట్టు నిమ్రత్ తో అభిషేక్ ఎంగేజ్మెంట్ అయిపోయిందని కొన్ని ఒక ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం వీరి ఫ్యాన్స్ ని మరింత టెన్షన్ కి గురి చేస్తోంది. ఈ సమయంలో ఓ ఈవెంట్ లో వైవాహిక జీవితంపై అడిగిన ప్రశ్నకి అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) చెప్పిన సమాధానం వారికి కొంత రిలీఫ్ ఇస్తోంది.
అభిషేక్ బచ్చన్ ఇటీవల ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డులు -2024 సెర్మనీకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన రీసెంట్ సినిమాల్లో తన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాడు. సినిమాల్లో వరుసగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఎలా సాధ్యమని హోస్ట్ అడిగిన ప్రశ్నకి సమాధానమిచ్చాడు. “ఇది చాలా సింపుల్. మేం చేసేదేమీ లేదు. డైరెక్టర్ మాకు ఏది చెబితే అది చేస్తాం. కామ్ గా పని చేసి ఇంటికి వచ్చేస్తాం” అని అభిషేక్ చెప్పాడు. అలాగే భార్య మాట కూడా వింటారా అని హోస్ట్ సరదాగా ప్రశ్నించగా… దీనికి అభిషేక్ కూడా సరదాగానే స్పందించాడు. “అవును, పెళ్ళైన మగవాళ్లందరూ అదే పని చేయాలి. మీ భార్య చెప్పినట్లే వినండి” అంటూ మగవాళ్ళకి అభిషేక్ బచ్చన్ సలహా ఇచ్చాడు.